Home » Exclusive » Viral Video Kangaroo Became Personal Trainer For A Person
Exclusive

Viral Video : వావ్.. జిమ్ ట్రైనర్‌గా కంగారూ..ఎలా ట్రైయినింగ్ ఇస్తుందో చూడండి..

Authored By
mallesh
The Telugu News | Published on: January 24, 2022, 4:00 pm
Advertisement

Viral Video : ప్రస్తుత కొవిడ్ భయానక పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరు ఆరోగ్యంపైన ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఫిట్ నెస్ పైన కూడా ఫోకస్ చేస్తున్నారు. అందుకుగాను లోకల్‌గా ఉండే జిమ్‌లకు వెళ్లి ట్రెయినింగ్ తీసుకుంటున్నారు. కాగా, జిమ్‌లో ట్రెయినర్ గా మనిషి కాకుండా కంగారూ ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. సూపర్ కదా.. అలా కంగారు ఓ వ్యక్తికి పర్సనల్ ట్రెయినర్‌గా మారింది. అయితే, సదరు కంగారు జిమ్‌లో కాకుండా ఇంటి వద్దనే ఓ వ్యక్తికి పర్సనల్ ఫిట్ నెస్ ట్రెయినర్ గా మారి ఆయన చేత పుష్‌అప్స్ చేయిస్తోంది.

Advertisement

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది.సదరు వైరల్ వీడియోలో సాధు జంతువు అయిన కంగారూ.. వ్యక్తికి పర్సనల్ ట్రెయినర్‌గా మారింది. బుయిటెన్ జిబైడెన్ అనే ట్విట్టర్ యూజర్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన వీడియోలో వ్యక్తికి పర్సనల్ ట్రెయినర్‌గా కంగారూ ఉంది. ‘పర్సనల్ ట్రెయినర్’ అనే క్యాప్షన్ తో షేర్ కాబడిన వీడియోలో ఓ వ్యక్తి గచ్చు మీద పుష్ అప్స్ చేస్తున్నాడు. కాగా, ఈ క్రమంలోనే కంగారు అతని చేత పుష్ అప్స్ చేయిస్తోంది.

viral video kangaroo became personal trainer for a person

Advertisement

Viral Video : ఆ వ్యక్తి చేత దగ్గరుండి మరీ పుష్‌అప్స్ చేయిస్తున్న కంగారూ..

కంగారు అలా సదరు వ్యక్తి భుజాల మీద తన ముందరి రెండు కాళ్లను పెట్టి మరీ పుషప్స్ చేపిస్తోంది. అది చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బహుశా పెట్ యానిమల్‌గా కంగారూను పెంచుకుని ఉంటారని వీడియోను చూసి కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి