Viral Video : కుక్కపిల్లను సొంత బిడ్డలా చూసుకుంటున్న కోడి.. ఈ జంటను చూస్తే ముచ్చటపడిపోతారు.. వైరల్ వీడియో!
Viral Video : కోళ్లు, కుక్కలు.. ఈ రెండింటికీ మనుషులతో అవినాభావ సంబంధం ఉంటుంది. కుక్కలు మనుషుల మధ్యే పెరుగుతాయి. మనుషులు లేకుంటే అవి ఉండలేవు. మనుషుల మధ్యే తిరుగుతుంటాయి అవి. ఆ తర్వాత కోళ్లు కూడా అంతే. కోళ్లు కూడా మనుషులతోనే.. మనుషుల మధ్యనే తిరుగుతుంటాయి.అలాగే.. ఇంట్లో ఎవరైనా కోళ్లను, కుక్కలను రెండింటినీ పెంచుకుంటే..
వాటికి క్షణం పడదు. రెండు ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటాయి. కుక్కలు కూడా వాటి వెంటపడుతూనే ఉంటాయి. అందుకే కోళ్లు కుక్కల వైపే చూడవుకానీ.. వాటి సహజ గుణానికి విరుద్ధంగా ఓ కోడి మాత్రం చిన్న కుక్క పిల్లను అక్కున చేర్చుకుంది. తన చెంత చేర్చుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు..
viral video of puppy and hen
Viral Video : కుక్కపిల్లను అక్కున చేర్చుకున్న కోడి
వావ్ క్యూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మనుషుల కన్నా ఇవి చాలా బెటర్. వాటి మధ్య బంధం ఎలా ఉంది చూడండి. చిన్న కుక్క పిల్లను అది ఎలా అక్కున చేర్చుకుందో చూడండి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.
