Viral Video on father who cried at daughter wedding
Viral Video : వివాహం అనేది సృష్టి ధర్మం. ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక అపురూపమైన ఘట్టం. అమ్మాయి, అబ్బాయికి యుక్త వయస్సు వచ్చి జీవితంలో సెటిల్ అయ్యాక వారికి పెళ్లి చేసి తమ బాధ్యతను తీర్చుకోవాలని ప్రతీ పేరెంట్స్ ఆలోచిస్తుంటారు.అబ్బాయి పెళ్లిని పెద్దగా సీరియస్ తీసుకోని తల్లిదండ్రులు అమ్మాయి విషయంలో మాత్రం చాలా కేరింగ్ తీసుకుంటారు. ఎందుకంటే మన ఇంటి అమ్మాయి వేరే వాళ్ల ఇంటికి వెళ్లిపోతుందనే భయం. తీరా ఆ క్షణాలు దగ్గర పడుతున్నాయనే తెలియగానే కుటుంబ సభ్యులు, బంధువులు అంతా ఎమోషనల్ అవుతారు. ముఖ్యంగా ఎదిగిన ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తింటికి పంపించడం ప్రతీ పేరెంట్స్ బాధ్యత.
అది నిర్వర్తించడానికి తల్లి కంటే తండ్రి చాలా కేరింగ్ తీసుకుంటాడు. ఒక మంచి కుటుంబంలోని అబ్బాయి చేతిలో తన కూతురిని చేయి పెట్టి ఇక నుంచి తల్లి అయినా, తండ్రి అయినా అన్నీ నువ్వే అని చెప్పి.. అల్లుడి కాళ్లు కడిగి మరీ వివాహం జరిపిస్తారు. హిందూ సంప్రదాయ మ్యారేజెస్‌లో ఇలాంటి దృశ్యాలు మన కల్లకు కట్టినట్టు దర్శనమిస్తాయి. ఇన్నిరోజులు అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఒక్కసారిగా పెళ్లి చేసుకుని వెళ్లిపోయే క్షణంలో ప్రతీ తల్లిదండ్రులు కంటతడి పెట్టుకుంటారు. ఈ మధ్యకాలంలో కొందరు పెద్దలు కుదిర్చిన సంబంధాలు చేసుకుంటుంటే మరికొందరు లవ్ మ్యారెజెస్ చేసుకుంటున్నారు.
Viral Video on father who cried at daughter wedding
సోషల్ మీడియా పుణ్యమా అని శుభకార్యం జరిగే సమయంలో చోటుచేసుకునే కొన్ని అరుదైన సంఘటనలను చూడగలుగుతున్నాం. తాజాగా ఓ తండ్రి తన కూతురికి ఘనంగా వివాహం చేశాడు. అనంతరం అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని అత్తగారింటికి పంపించే క్రమంలో చిన్న పిల్లాడిలా మారి వెక్కి వెక్కి మరి ఏడ్చాడు. ఈ అరుదైన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూతురిని ఓ మంచి వ్యక్తి చేతిలో పెట్టి తన బాధ్యతను తీర్చుకున్నామనే సంతోషంతో పాటు ఇన్ని రోజులు తమతో ఉన్న బిడ్డ వేరే ఇంటికి వెళ్లిపోతుందన్న బాధ ఒక్కసారిగా వారిని కంటతడి పెట్టించేలా చేస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
Kasivinda Plant | చెన్నంగి లేదా కసివింద అని పిలువబడే ఈ మొక్కకు అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న చెన్నంగి,…
Aloevera juice | కలబంద అద్భుతమై మూలిక. ఈ జ్యూస్‌లో విటమిన్ ఏ, సీ,ఈ , బీ1, బీ2, బీ3,…
Vastu Tips | హిందూ సంప్రదాయంలో ప్రకృతికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులలో దైవత్వాన్ని చూసే ఆచారం…
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…
This website uses cookies.