Gorantla Madhav : ఏపీ రాజకీయాలు మొత్తం హిందూపురం పార్లమెంట్ మెంబర్ గోరంట్ల మాధవ్ చుట్టే తిరుగుతున్నాయి.మహిళలకు న్యూడ్ కాల్ చేసి మాట్లాడుతున్న వీడియో ఒకటి లీక్ అవ్వడంతో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నాయకులు ఈ విషయంలో అధికార వైసీపీని ఓ ఆటాడుకుంటున్నారు. మీ పార్టీ నాయకులు ఇలాంటి నీచ వ్యవహారాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ ఫైర్ అవుతున్నారు. ఇదే విషయం ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారీ తీసింది.
దీనిపై సీఎం జగన్ కూడా స్పందించారని తెలిసింది.ఈ వ్యవహారంపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని ఆ వీడియో మార్ఫింగ్ కాదని తెలిస్తే సదరు ఎంపీపై చర్యలుంటాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల మీడియాకు వెల్లడించారు.
ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడయోను అడ్డు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అధికార వైసీపీని రాజకీయంగా దెబ్బకొట్టాలని భావించినా అది పెద్దగా వర్కౌట్ కాలేదని తెలుస్తోంది. న్యూడ్ వీడియో వెలుగులోకి వచ్చి వారం రోజులైంది. దానినే పట్టుకుని టీడీపీ ఇంకా వేలాడుతోంది.ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి అభ్యంతరకర వీడియోలు దొరికితే ఏం చేయాలో తెలుగు తమ్ముళ్లు అదే చేస్తున్నారు. అయితే, టీడీపీకి ప్రజల నుంచి అనుకున్నంత మద్దతు లభించలేదని వాదన వినిపిస్తోంది.హిందూపురం ఎంపీ న్యూడ్ వీడియోను అసహ్యించుకుంటున్నట్టే టీడీపీ నేతల అభ్యంతరకర ప్రచారాన్ని కూడా జనం వ్యతిరేకిస్తున్నట్టు టాక్. జనాలకు ఇలాంటి వీడియోలు అవసరం లేదు. మంచైతే తీసుకుంటారు. చెడు అయితే తిరస్కరిస్తారు.
ఈ విషయంలో విచారణ జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించడంతో జనం కూడా లైట్ తీసుకున్నారని, విచారణలో ఏం తేలుతుందో చూద్దామని వారు ఎదురుచూస్తున్నారట.. కానీ తెలుగుదేశం పార్టీ లీడర్లు పదే పదే న్యూడ్ వీడియో వ్యవహారంపై మాట్లాడటం జనాలకు కూడా చిరాకు తెప్పిస్తుందని సమాచారం. మాధవ్ వ్యవహారంపై స్పందిస్తున్న టీడీపీ నేతలు ఏమైనా మంచివారా? అని కూడా జనాలు మాట్లాడుకుంటున్నారట..వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా నాయకులు, అలాగే కాల్‌మనీ, సెక్స్ రాకెట్ కేసుల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న నాయకులే ఎంపీ మాధవ్ వ్యవహారంపై పదే పదే స్పందించడాన్ని జనం తీసుకోలేకపోతున్నారట.. ఎవరైనా మచ్చలేని, గౌరవప్రద నాయకులకు న్యూడ్ వ్యవహారంపై స్పందించే బాధ్యతను చంద్రబాబు అప్పగించి ఉంటే బాగుండేదని భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే టీడీపీ ఎంపీ మాధవ్‌ను ఇరకాటంలో పెట్టే ప్లాన్ బెడిసికొట్టిందని తెలుస్తోంది.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.