Home » News » Viral Video The Police Threw The Dead Body Into The Canal
News

Viral Video : బీహార్ లో దారుణం .. శవాన్ని కాలువలో పడేసిన పోలీసులు ..!

Authored By
aruna
The Telugu News | Published on: October 10, 2023, 2:00 pm
Advertisement

Viral Video  : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఎక్కడ ఏం తప్పు జరిగిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఆ తప్పు పై నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ తప్పు చేసిన వారిని ఏకిపారేస్తుంటారు. ఆ తప్పు చేసింది ఎవరని కూడా చూడరు వాళ్ళను ఒక రేంజ్ లో ఆడేసుకుంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. అందులో పోలీసులు చేసిన పనికి అంతా షాక్ అయిపోతున్నారు. ఇది చూసిన నెటిజన్లు పోలీసులు చేసిన నిర్వాకంపై ఫైర్ అవుతున్నారు.

Advertisement

బీహార్ లోని ముజఫర్ అనే ఊర్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రమాదంలో ఛిద్రమైన మృతదేహాన్ని పోలీసులు కాలువలో పడేశారు. అటుగా వెళుతున్న ఓ వ్యక్తి ఆ తతంగం మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది కాస్త వైరల్ కావడంతో డిఎస్పి వద్దకు చేరుకుంది. పోలీసుల తీరుపై ఫైర్ అయిన డీఎస్పి బాడీని వెలికి తీయించారు. ఘటనకు బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేశారు. మృతదేహం ఎవరిదో గుర్తించి పోస్టుమార్టంకు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.

Viral Video The police threw the dead body into the canal

Advertisement

ఈ వీడియో పైన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. ఆ మృతదేహం ఎవరిదో గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించాల్సింది పోయి పక్కనే ఉన్న కాలువలో పడేసిన పోలీసులు నిర్వాకం చూసి ఫుల్ ఫైర్ అవుతున్నారు. పోలీస్ సిబ్బంది ఉన్నది ప్రజల సంరక్షణ కొరకే కదా మీరే ఇలా చేస్తే ప్రజా సంరక్షణను ఎవరు చూసుకుంటారు అని నెటిజన్లు వాపోతున్నారు. మొత్తానికి ఆ పోలీసులు చేసిన నిర్వాకం దేశమంతట సంచలనంగా మారింది. ఇక సోషల్ మీడియా ద్వారా అది మరింతగా వైరల్ అయింది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి