Home » News » Woman Climbs Jio Cell Tower After Fight With Fellow Sister In Law
News

Viral Video : తోటికోడలు తిట్టిందని సెల్ టవర్ ఎక్కిన మహిళ.. ఆ తర్వాత ఏమైందో తెలుసా? వైరల్ వీడియో

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: July 20, 2023 1:39 pm
Advertisement

Viral Video : ఈరోజుల్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ ఉంటారు. మనిషి నైజమే అది. ఎవరు తిట్టినా బాధపడిపోతుంటారు. తమలో తామే కుమిలిపోతుంటారు. ఎవరో తిట్టారని అఘాయిత్యాలు చేసుకునేవాళ్లు కూడా ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకునే వాళ్లూ ఉన్నారు. ఎందుకంటే.. పరువు కోసం ప్రాణాలు ఇస్తారు.. ప్రాణాలు తీస్తారు కొందరు. ఎవరైనా తిడితే తమ పరువు పోయిందని అనుకుంటారు. అందుకే చివరకు తమ ప్రాణాలు కూడా తీసుకోవడానికి వెనుకాడరు.

Advertisement

తాజాగా అటువంటి ఘటనే ఒకటి ఏపీలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కంభంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తోటి కోడలు తిట్టిందని ఓ మహిళ జియో సెల్ టవర్ ఎక్కింది. పెద్దారవీడు అనే గ్రామానికి చెందిన లక్ష్మీబాయిపై కేసు పెట్టడంతో పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్ కు పిలిచారు. ఆమెను విచారించారు. దీంతో ఆమె దాన్ని అవమానంగా భావించింది.తన తోటికోడలు తన మీద కేసు పెట్టడంతో ఆ మహిళ తట్టుకోలేకపోయింది. చివరకు పెద్దారవీడు పోలీసులు తనను పిలిచి విచారించడంతో అవమానంగా భావించింది. పోలీసుల విచారణకు హాజరైన తర్వాత కుంభం వచ్చిన మహిళ.. అక్కడే ఉన్న జియో టవర్ ఎక్కింది.

woman climbs jio cell tower after fight with fellow sister in law

Advertisement

Viral Video : అవమానాన్ని తట్టుకోలేక సెల్ టవర్ ఎక్కిన మహిళ

నిరసనకు దిగింది. ఈ విషయం పోలీసులకు తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి ఆ మహిళను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఎంత చెప్పినా అస్సలు వినలేదు. అక్కడి నుంచి దూకేస్తా అంటూ బెదిరించింది ఆ మహిళ. చివరకు కుటుంబ సభ్యులు, పోలీసులు అందరూ అక్కడికి వెళ్లి తనను ఎలాగోలా బుజ్జగించి కిందికి దింపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి