Home » News » Woman Tied Rakhi To Her Dead Brother Hand In Peddapalli Viral Video
News

Viral Video : రాఖీ పండుగ నాడే విషాదం.. గుండెపోటుతో మృతి చెందిన అన్నకి రాఖీ కట్టిన చెల్లెలు

Authored By
Breaking News 2
The Telugu News | Published on: August 30, 2023, 7:25 pm
Advertisement

Viral Video : ఆగస్టు 30, 31 రెండు రోజులు చాలామంది రాఖీ పండుగ జరుపుకుంటున్నారు. కొందరు 30వ తారీఖునే జరుపుకుంటుండగా మరికొందరు మాత్రం 31వ తేదీన జరుపుకుంటున్నారు. రాఖీ పండుగ అంటేనే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. రాఖీ పండుగ అంటేనే వాళ్ల మధ్య ఉండే అన్యోన్య బంధాన్ని తెలియజేస్తుంది. తల్లిదండ్రుల తర్వాత ఒక అక్క కానీ.. చెల్లెకు కానీ అన్నదమ్ములే తోడుగా ఉంటారు. ఏ ఆపద వచ్చినా మేమున్నాం ఆదుకుంటామంటూ ముందుకు వస్తారు.

Advertisement

అందుకే రాఖీ పండుగకు మన దేశంలో చాలా విశిష్టత ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకుంటున్న నేపథ్యంలో ఒక విషాద ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామానికి చెందిన చౌదరి కనకయ్య అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. అప్పటికే రాఖీ కట్టడానికి ఆయన సోదరి గౌరమ్మ తన ఇంటికి వచ్చింది. అప్పటి దాకా ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్న చౌదరి కనకయ్య ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే మృతి చెందాడు.

Viral Video : రాఖీ పండుగ నాడే విషాదం.. గుండెపోటుతో మృతి చెందిన అన్నకి రాఖీ కట్టిన చెల్లెలు

Advertisement

Viral Video : చౌదరి కనకయ్య మృతదేహానికి రాఖీ కట్టి సాగనంపిన గౌరమ్మ

రాఖీ కట్టడానికి వచ్చిన గౌరమ్మ అన్న గుండెపోటుతో చనిపోవడాన్ని తట్టుకోలేకపోయింది. పుట్టెడు దుఃఖంలోనూ తన అన్న కనకయ్యకు చివరి సారిగా రాఖీ కట్టి అన్నను సాగనంపింది. చెల్లెలు గౌరమ్మకు తన అన్న పట్ల ఉన్న ప్రేమను చూసి ఆమె రాఖీ కట్టడం చూసి బంధువులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతం అయ్యారు. అందరూ బోరున విలపించారు. రాఖీ పండుగ నాడే ఇంతటి ఘోర విషాదం చోటు చేసుకోవాలా అంటూ గ్రామస్తులు వెక్కి వెక్కి ఏడ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ వీడియోను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వీడియో చూసే వాళ్లకు కన్నీళ్లు అస్సలు ఆగడం లేదు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి