Anasuya : హంసలా అనసూయ.. తెల్లదుస్తుల్లో రంగమ్మత్త రచ్చ

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 25 March 2021, 5:08 pm

Anasuya : బుల్లితెరపై అనసూయ అందాల ఆరబోత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసే ఫోటోలు, ప్రతీ వారం చేసే ఫోటో షూట్లు ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. అనసూయ అందాల ప్రదర్శనపై ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటుంది. అనసూయ ప్రస్తుతం ఇటలీలో ఉన్న సంగతి తెలిసిందే. రవితేజ ఖిలాడి సినిమా కోసం అనసూయ మిలాన్‌కు చెక్కేసింది.

Anasuya Bharadwaj latest photoshoot goes viral

Anasuya Bharadwaj latest photoshoot goes viral

అనసూయ ఈ మధ్యే చావు కబురు చల్లగా సినిమాతో అందరినీ కట్టిపడేసింది. పైన పటారం అంటూ అదిరిపోయే హాట్ స్టెప్పులతో కుర్రకారు మతిపోగొట్టేసింది. అలా అనసూయ చేసిన ఐటం సాంగ్స్ యూత్‌లో బలమైన ముద్ర వేసేస్తున్నాయి. విన్నర్ సినిమా కోసం సూయ సూయ అనసూయ అనే పాటకు కాలు కదిపింది. మళ్లీ ఇన్నాళ్లకు కార్తికేయ పక్కన డ్యాన్సులు వేసింది. ఆ పాటలో అనసూయ చీరకట్టుకు కూడా అందరూ ఫిదా అయ్యారు.

Anasuya Bharadwaj latest photoshoot goes viral

Anasuya Bharadwaj latest photoshoot goes viral

Anasuya : హంసలా అనసూయ.. తెల్లదుస్తుల్లో రంగమ్మత్త రచ్చ

ఇక తాజాగా తెల్లటి దుస్తుల్లో అనసూయ హంసలా మెరిసిపోయింది, జబర్దస్త్ షో కోసం ప్రతీ వారం స్పెషల్ దుస్తులను ధరిస్తుంటుంది అనసూయ. ఆ దుస్తుల్లో అనసూయ వెరైటీ ఫోజులు పెడుతూ చేసిన ఫోటో షూట్‌తో నెట్టింట్లో అగ్గి రాజేస్తుంటుంది. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అనసూయ ఇప్పుడు పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోన్నట్టు తెలుస్తోంది.

Advertisement

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి