Coriander Seeds Water : పరిగడుపున నానబెట్టిన ధనియాల నీరు తాగితే… ఎన్ని లాభాలో తెలుసా…!
ప్రధానాంశాలు:
Coriander Seeds Water : పరిగడుపున నానబెట్టిన ధనియాల నీరు తాగితే... ఎన్ని లాభాలో తెలుసా...!
Coriander Seeds Water : సాధారణంగా మన వంటగదిలో ఉండే మసాలా దినుసులలో ధనియాలు కూడా ఒకటి. అయితే ఈ ధనియాల పొడిని దాదాపు ప్రతి వంటలో కూడా వేస్తారు. అయితే ఈ ధనియాల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను మాత్రం ఎక్కువగా ఎవరూ తెలుసుకోరు. ముఖ్యంగా చెప్పాలంటే. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారికి ఈ ధనియాలు దివ్య ఔషధం లాగా పని చేస్తాయి. అయితే థైరాయిడ్ సమస్యలు తగ్గించడంలో ఈ ధనియాలు ఎంతో హెల్ప్ చేస్తాయి. అయితే మీరు ఉదయాన్నే పరిగడుపున కొత్తిమీర నీటిని తీసుకోవడం వలన థైరాయిడ్ సమస్యను నియంత్రించవచ్చు. అయితే థైరాయిడ్ సమస్యలు అనే అసమాతుల్యత వాత మరియు కఫ దోషాల వలన వచ్చే హార్మోన్ల అసమతుల్యత అని చెప్పొచ్చు. ఈ ధనియాలలో ఎన్నో రకాల పోషకాలు పొటాషియం, ఇనుము ఇతర ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉన్నాయి. వీటిలో డైటరీ ఫైబర్,విటమిన్లు ఏ సి కె కూడా ఉన్నాయి. ఈ ధనియాల నీటిని తీసుకోవడం వలన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అయితే ఈ థైరాయిడ్ సమస్యకు ధనియాలను ఎన్నో రకాలలో తీసుకోవడం వలన ఎంతో మేలు జరుగుతుంది…
ఈ ధనియాలు జర్ణ క్రియను సులభం చేస్తుంది. అలాగే ఈ ధనియాల జీర్ణక్రియ కు మేలు చేసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉన్నది. ఈ ధనియాలను నీటిలో నానబెట్టి తీసుకోవడం వలన జీర్ణాశయంత్ర సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే ఉబ్బరం కూడా తగ్గుముఖం పడుతుంది. అంతేకాక పేగు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే కొన్ని పరిశోధనల ప్రకారం చూసినట్లయితే, ధనియాలు హైపోగ్లైసోబిక్ లక్షణాలను కలిగి ఉండడం వలన రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటంలో కూడా మేలు చేస్తుంది. ఈ ధనియాల నీటిని నిత్యం తాగడం వలన మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ధనియాలలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమెంటరీ కెమికల్స్ అనేవి బాడీలో మంటను కూడా తగ్గిస్తాయి. వీటిని నిత్యం తీసుకోవడం వలన ఇన్ ప్లామెంటరీ సమస్యతో ఇబ్బంది పడే వారికి కూడా మేలు చేస్తుంది. ఈ ధనియాలలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇది ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి మరియు ఆక్సీకరణ ఒత్తిడి నుండి కాపాడడానికి కూడా మేలు చేస్తాయి. ఇది దీర్ఘకాలిక సమస్యల నుండి కూడా రక్షిస్తుంది.
ఈ ధనియాలలో ఉన్న ఎక్కువ ఫైబర్ కంటెంట్ వలన కడుపు నిండిన ఫీలింగ్ లో ఇస్తుంది. దీని వలన బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే కొత్తిమీర అనేది రుతు నొప్పిని కూడా నియంత్రిస్తుంది. మహిళలు పీరియడ్స్ టైం లో ధనియాల నీటిని తీసుకోవడం వలన కడుపు నొప్పి మరియు కడుపు తిమ్మిరి లాంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే కొత్తిమీర అనేది చర్మ ఆరోగ్యాన్ని కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. ఈ ధనియాల నీటిని నిత్యం తీసుకోవడం వలన చర్మ సమస్యలకు చికిత్స చేయడంలో కూడా ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఇవి మెరిసే ఛాయను కూడా ఇస్తాయి. ఈ ధనియాలు అనేవి సహజంగా విశ్రాంతిని కూడా ఇస్తాయి. అయితే మీరు మీ రోజును ధనియాల నీటితో మొదలుపెట్టడం వలన టెన్షన్ మరియు ఆందోళన నుండి కూడా ఉపశమనం కలుగుతుంది…