Home » Amaravathi » Tollywood Hero Manchu Manoj Met Ap Cm Jagan
amaravathi

Amaravati..సీఎం జగన్‌తో హీరో మంచు మనోజ్ భేటీ

Authored By
praveen T
The Telugu News | Updated on: September 6, 2021 3:42 pm
Advertisement

ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిని అమరావతిలో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, సీఎం జగన్‌ను కలవడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని, స్టేట్ ఫ్యూచర్ కోసం జగన్ ప్రణాళికలు, దూరదృష్టి తనను బాగా ఆకర్షించాయని మనోజ్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల సీఎంకు ఉన్న దార్శనికతకు తాను ముగ్ధుడినయ్యానని మనోజ్ తెలిపారు. కాగా టాలీవుడ్ సినీ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి తదితరులతో సీఎం జగన్ త్వరలో భేటీ కాబోతున్నారు.

Advertisement

తెలగు చిత్రసీమలో నెలకొన్న సమస్యలు, ఏపీలో థియేటర్స్ షోస్, ధరలు తదితర విషయాలపై చిరంజీవితో పాటు సినీ ప్రముఖులు కొందరు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే చిరంజీవికి ఆహ్వానం అందిందని వినికిడి. కాగా, మెగాస్టార్ చిరు కంటే ముందరే టాలీవుడ్ హీరో మనోజ్ సీఎం జగన్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకున్నది. సీఎం జగన్‌తో మంచు వారి ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ షిప్ నేపథ్యంలో మనోజ్ ఇలా క్యాజువల్‌గా కలిసి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భేటీలో మనోజ్ సీఎం జగన్‌తో పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం.

Advertisement

 

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి