Jagan – Amaravati : ‘సామాజిక రాజధాని’ అని జగన్ అమరావతికి ఎందుకు పేరు పెట్టాడు… దీ తెలుగు న్యూస్ విశ్లేషణ..!
Jagan – Amaravati : ఏపీలో ఆర్ 5 జోన్ గురించి ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. పేదలకు ఇళ్ల పట్టాలు కూడా పంపిణీ చేశారు. పేదలకు ఇచ్చిన ఆర్ 5 జోన్ స్థలాల్లో జులై 8 నుంచి ఇళ్ల నిర్మాణం కూడా చేపడతామని సీఎం జగన్ తెలిపారు. సీఎం జగన్ తుళ్లూరు మండలం వెంకటపాలెంలో 50,793 మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి రోజున అంటే జులై 8న ఇళ్ల నిర్మాణాలు చేపడతామని స్పష్టం చేశారు. దానికి సంబంధించి గృహ నిర్మాణ అధికారులు కూడా లబ్ధిదారుల నుంచి మూడు ఆప్షన్లను తీసుకున్నారని..
అమరావతి అనేది సామాజిక రాజధాని అని.. అక్కడ అన్ని సామాజిక తరగతుల వారికి ప్రాతినిధ్యం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పేదలంటే అంత చులకన చేస్తారా? పేదలకు ఇళ్లు కట్టిస్తే మురికివాడలు వస్తాయా? సామాజిక సమతుల్యత దెబ్బతింటుందా? టీడీపీ నాయకులు పేదలపై అడ్డగోలుగా దుష్ప్రచారం చేశారు. వాళ్లకు ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వనీయలేదు. అయినా కూడా సామాజిక న్యాయం కోసం పేదలకు రూ.10 లక్షల విలువైన స్థలాలను ప్రతి ఒక్క పేద మహిళలకు అందించాం అని సీఎం జగన్ తెలిపారు.
Jagan – Amaravati : ఇవి ఇళ్ల పట్టాలు కాదు.. సామాజిక న్యాయ పత్రాలు
ఇవి కేవలం ఇళ్ల పట్టాలు మాత్రమే కాదు.. సామాజిక న్యాయ పత్రాలు అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఏదో పేదలకు ఇళ్ల నిర్మాణం చేయించి వదిలేయడం కాదు. వాళ్లకు ఇళ్ల నిర్మాణంతో పాటు.. అక్కడే అంగన్ వాడీ కేంద్రం, విలేజీ క్లీనిక్, డిజిటల్ లైబ్రరీ, ప్రాథమిక పాఠశాల, పార్కులు అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తాం.. అని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అలాగే.. అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మించిన 5024 టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు సీఎం జగన్ పంపిణీ చేశారు.