Amaravati Movement : అమరావతి ఉద్యమం గురించి కొలికపూడి కీలక వ్యాఖ్యలు, జగన్ ఫస్ట్ నుంచి చెప్తోంది అదే కదా !
Amaravati Movement: అమరావతి పరిరక్షణ ఉద్యమ నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు తెలుసు కదా. ఆయన సోషల్ మీడియాలో తాజాగా ఒక షాకింగ్ పోస్ట్ పెట్టారు. నిజానికి కొలికపూడి శ్రీనివాసరావు.. తరుచూ పలు న్యూస్ చానెళ్లలో డిబేట్ లో పాల్గొంటూ ఉంటారు. ఏపీ ప్రభుత్వంపై రచ్చ రచ్చ చేస్తుంటారు. ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇది వరకు చేశారు కూడా. అమరావతి ఉద్యమాన్ని కించపరిచేలా ఎవరు మాట్లాడినా వాళ్లపై మాటల యుద్ధమే ప్రకటించేవారు కొలికిపూడి శ్రీనివాసరావు.
అలాంటి శ్రీనివాసరావు.. ఇప్పుడు అదే ఉద్యమంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫేస్ బుక్ పేజీలో పెట్టిన పోస్టు కూడా అదే. అమరావతి ఉద్యమం రైతుల నాయకత్వంలో నడిచిన అన్ని రోజులు ప్రభుత్వాన్ని భయపెట్టిందని అన్నారు. కానీ.. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ దళారులు ఉద్యమ నాయకులు అయ్యారో అప్పుడే ఉద్యమం చనిపోయిందని.. అది కాస్త ఇప్పుడు ప్రభుత్వమే రైతులను భయపెట్టే పరిస్థితులు వచ్చాయన్నారు. ప్రతి పార్టీ ఇప్పుడు ఓట్లను లెక్కేసుకుంటోందని.. రాజధానికి భూములను ఇచ్చిన రైతులను బలి ఇస్తోందన్నారు.
Amaravati Movement : అమరావతి రాజధానికి వైసీపీ శత్రువు అని ఒప్పుకున్నట్టే కదా
తాము ప్రభుత్వంలో ఉన్నంత కాలం అమరావతిని రాజధానిగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని ఏపీ ప్రభుత్వం తెగేసి చెబుతున్న విషయం తెలిసిందే. అందుకే.. ఆ ప్రాంత రైతులు కూడా ఈ విషయంపై పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. అమరావతి రాజధానికి మేమే శత్రువులం అని ఒప్పుకుంటున్నారు కదా. అదందా ఓకే కానీ.. అసలు రాజధాని శత్రువులు ఎవరంటే.. కనపించని వారు. వాళ్లతోనే అసలు ప్రమాదం. అన్ని రాజకీయ పార్టీలు కలసి రాజధానికి భూములను ఇచ్చిన రైతులను బలి ఇస్తున్నాయి…అంటూ కొలికిపూడి చేసిన వ్యాఖ్యల్లో అర్థం ఏంటో ఏపీ ప్రజలకు కూడా తెలిసింది. ఆయన గత మూడేళ్ల నుంచి అమరావతి రాజధాని కోసం తన వాయిస్ ను బలంగా వినిపిస్తున్నారు.