టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పొలిట్ బ్యూరో మెంబర్ వర్లరామయ్య అవగాహన లేకుండానే అర్థరహితంగా రాష్ట్ర హోం మంత్రి, డీజీపీపై విమర్శలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ అన్నారు. ఆదివారం అనంతరంపురం జిల్లాలో ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడారు. మహిళల భద్రత కోసం వైసీపీ సర్కారు పని చేస్తున్నదని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి మహిళల భద్రతపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. మహిళల రక్షణ కోసమే వైసీపీ అధినేత, ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ‘దిశ’ చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు.
ఆ చట్టం ద్వారానే నేరం జరిగిన వారం రోజుల్లో పోలీసులు చార్జిషీట్ వేస్తున్నారని వివరించారు. అలా నేరం జరిగిన ఏడు రోజుల్లోనే చార్జిషీట్ వేస్తున్న ఘనత ఏపీ పోలీసులకే దక్కుతుందని చెప్పారు. ఈ విషయాలేవీ తెలుసుకోకుండా టీడీపీ నేతలు పలు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ ఇక్బాల్ వివరించారు. ‘దిశ’ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం కావాలని, అప్పుడే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పడుతాయని చెప్పారు. టీడీపీ నేతలు ‘దిశ’ చట్టం ఆమోదం పొందేలా కేంద్రాన్ని ఎందుకు కోరడం లేదని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. రాజ్యాంగ బద్ధమైన న్యాయవ్యవస్థ పోలీసు వ్యవస్థకు టీడీపీ నేతలు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ ఇక్బాల్ డిమాండ్ చేశారు.
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
This website uses cookies.