YS Jagan : దేశం మొత్తం మెచ్చుకుంటుంది.. జగన్ ఐడియా అద్దిరిపోయింది !
YS Jagan : ఏపీని అభివృద్ధిలో ముందంజలో ఉంచడమే కాదు.. రాష్ట్రాన్ని క్లీన్ గానూ ఉంచాలి కదా. ప్రస్తుతం అదే పెద్ద చాలెంజ్. అందుకే ప్రతి మున్సిపాలిటీలో చెత్త సేకరణకు, పారిశుద్ధ్య నిర్వహణకు సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ వహించి పర్యావరణహితంగా రాష్ట్రాన్ని మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. అందుకే చిన్న మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ కోసం ఈ ఆటోలను ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని వల్ల మున్సిపాలిటీలకు వాహనాల నిర్వహణ భారం కూడా భారీగా తగ్గుతుంది. […]
YS Jagan : ఏపీని అభివృద్ధిలో ముందంజలో ఉంచడమే కాదు.. రాష్ట్రాన్ని క్లీన్ గానూ ఉంచాలి కదా. ప్రస్తుతం అదే పెద్ద చాలెంజ్. అందుకే ప్రతి మున్సిపాలిటీలో చెత్త సేకరణకు, పారిశుద్ధ్య నిర్వహణకు సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ వహించి పర్యావరణహితంగా రాష్ట్రాన్ని మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. అందుకే చిన్న మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ కోసం ఈ ఆటోలను ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని వల్ల మున్సిపాలిటీలకు వాహనాల నిర్వహణ భారం కూడా భారీగా తగ్గుతుంది.
రాష్ట్రంలోని చిన్న మున్సిపాలిటీలు అయిన 36 మున్సిపాలిటీల్లో రూ.4.10 లక్షల విలువైన 516 ఈ ఆటోలను పంపిణీ చేశారు. వీటి కోసం రూ.21.18 కోట్ల నిధులను ప్రభుత్వం వెచ్చించింది. ఒక్క ఆటో 500 కిలోల చెత్తను తీసుకెళ్లగలదు. అలాగే.. ఈ ఆటోలకు డ్రైవర్లుగా మహిళలను నియమించనున్నారు. దాని వల్ల మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్ద పీట వేసినట్టు అవుతుంది.చెత్త సేకరణ కోసం, వ్యర్థాల నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం.. జగనన్న స్వచ్ఛ సంకల్పం అనే పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇప్పటికే రూ.72 కోట్లతో 123 మున్సిపాలిటీలలో 40 లక్షల కుటుంబాలకు చెత్త బుట్టలను పంపిణీ చేశారు.
YS Jagan : విజయవంతంగా నడుస్తున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం
మొత్తం మూడు రకాల చెత్త బుట్టలను ప్రభుత్వం పంపిణీ చేసింది. హానిక వ్యర్థాల సేకరణకు ఒక బుట్ట, తడి చెత్తకు ఒక బుట్ట, పొడి చెత్తకు మరో బుట్ట.. మొత్తం మూడు బుట్టలను పంపిణీ చేసింది. పెద్ద పెద్ద మున్సిపాలిటీలలో అంటే గ్రేడ్ వన్, అంత కంటే పైన ఉన్న మున్సిపాలిటీలలో మాత్రం చెత్త సేకరణ కోసం 2500కు పైగా టిప్పర్లను వినియోగిస్తున్నారు. అవి పెట్రోల్, డీజిల్, సీఎన్జీతో నడిచేవి. ఇలా.. చెత్త సేకరణ కోసం, చెత్త నిర్వహణ కోసం.. ఏపీని క్లీన్ రాష్ట్రంగా మార్చడం కోసం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా తీసుకోలేదు. అందుకే దేశమంతా ప్రస్తుతం ఏపీవైపు చూస్తోంది.