Sajjala Ramakrishna Reddy : ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అన్నీ నెరవేర్చారని.. అది కూడా ఎలాంటి వివక్షకు తావు లేకుండా అందరికీ పారదర్శకంగా సంక్షేమ పథకాలను అందించారని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అర్హతే ప్రమాణంగా తీసుకొని రాష్ట్రంలోని పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలను అత్యంత పారదర్శకంగా అందిస్తున్నారన్నారు. అలాగే.. జనవరి 1, 2024 నుంచి పింఛన్ ను రూ.3 వేలకు పెంచుతున్నట్టు తెలిపారు. ఆ కార్యక్రమాన్ని ఒక పండుగలా ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో సుమారు 66 లక్షల మందికి పింఛన్ అందిస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలను మరింత బలంగా జనంలోకి తీసుకెళ్లేందుకు కార్యచరణ రూపొందిస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ పార్టీకే డిమాండ్ ఉందని.. మంచి ఫామ్ లో ఉన్నామని సజ్జల తెలిపారు. ఇక్కడ ఇమడలేని వారు ఉంటే వెళ్లిపోతారని.. అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల మార్పు, పార్టీలో ఇతర మార్పులు ఉంటాయని స్పష్టం చేశారు. అభ్యర్థుల మార్పు ఉంటే.. వాళ్లకు ప్రజలకు పరిచయం చేయడం, పార్టీ నాయకులు వారితో సమన్వయం చేయడం జరుగుతుందన్నారు. అభ్యర్థుల మార్పు కూడా వీలైనంత త్వరగా జరుగుతుందన్నారు. మార్పు జరిగిన తర్వాతనే రీజనల్ కోఆర్డినేటర్లు సమన్వయం చేసుకుంటారన్నారు.
అలాగే.. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కోసం దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇందులో అందరి భాగస్వామ్యం ఉండేలా చేస్తానన్నారు. అలాగే వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత చివరి ఇన్ స్టాల్ మెంట్ ను లబ్ధిదారులకు అందించే కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.