Amaravati : అమరావతిపై కేంద్రం సూప‌ర్ గుడ్‌న్యూస్‌.. ఆ దిశ‌గా అడుగులు..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 21 January 2026, 9:00 pm
  •  Amaravati : అమరావతిపై కేంద్రం సూప‌ర్ గుడ్‌న్యూస్‌.. ఆ దిశ‌గా అడుగులు..!

Amaravati : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజధాని అంశంపై కేంద్రం నుంచి కీలక సంకేతాలు అందుతున్నాయి. సుదీర్ఘ కాలంగా అమరావతిని ఏపీ రాజధానిగా చట్టబద్ధంగా ప్రకటించాలని రైతులు, ప్రజలు కోరుతున్న నేపథ్యంలో, ఆ దిశగా ఇప్పుడు నిర్ణయాత్మక దశకు ప్రక్రియ చేరుకున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతిని కేంద్రంగా చేసుకుని వరుస నిర్ణయాలు తీసుకుంటుండగా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా సమీపంలో ఉందన్న సమాచారం ప్రాధాన్యం సంతరించుకుంది.రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించిన విషయం తెలిసిందే.

Amaravati : అమరావతిపై కేంద్రం సూప‌ర్ గుడ్‌న్యూస్‌.. ఆ దిశ‌గా అడుగులు..!

Amaravati : అమరావతిపై కేంద్రం సూప‌ర్ గుడ్‌న్యూస్‌.. ఆ దిశ‌గా అడుగులు..!

Amaravati : కేంద్రం గుడ్ న్యూస్..

ఆ గడువు 2024 జూన్ 2తో ముగియడంతో, ఆ తేదీ నుంచే అమరావతిని అధికారిక రాజధానిగా ప్రకటించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీనికి అనుగుణంగా రాజధాని ఎంపిక, నిర్మాణ ప్రణాళికలు, మౌలిక సదుపాయాలపై కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర వివరాలను సమర్పించింది. కేంద్రం అడిగిన అన్ని అంశాలపై స్పష్టత ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.ఈ అభ్యర్థనపై కేంద్ర హోంశాఖ ఇప్పటికే పలు మంత్రిత్వ శాఖల అభిప్రాయాలను సేకరించినట్లు సమాచారం. ఎక్కువ శాఖలు తమ సూచనలు, అభిప్రాయాలు అందించగా, పట్టణాభివృద్ధి మరియు న్యాయ శాఖల నుంచి ఇంకా అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఇవి కూడా పూర్తయ్యాక, కేంద్ర క్యాబినెట్‌లో ఈ అంశంపై చర్చించి తుది ఆమోదం ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

వచ్చే వారం ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే అమరావతిని ఏపీ రాజధానిగా చట్టబద్ధం చేసే బిల్లును ప్రవేశపెట్టే యోచనలో కేంద్రం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించిన క్యాబినెట్ నోట్ తయారీపై హోంశాఖ ఇప్పటికే కసరత్తు చేస్తోందని సమాచారం. బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ముందు మరోసారి ఏపీ ప్రభుత్వంతో కేంద్రం సంప్రదింపులు జరపనున్నట్లు తెలుస్తోంది.ఇదే సమయంలో అమరావతి రైతులు కూడా ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వాలు మారినా అమరావతే రాజధానిగా కొనసాగాలన్న భరోసా చట్టబద్ధంగా ఉండాలని వారు స్పష్టం చేశారు.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu ( Tandu Ramalingaiah ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి