Amit Shah : ఓ ఇదా అసలు ప్లానింగ్, అమిత్ షా జగన్ మీద ఓపెన్ గా సీరియస్ అవడం వెనక స్కెచ్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Amit Shah : ఓ ఇదా అసలు ప్లానింగ్, అమిత్ షా జగన్ మీద ఓపెన్ గా సీరియస్ అవడం వెనక స్కెచ్ !

Amit Shah : ఏంటో ఈ మధ్య బీజేపీ జాతీయ నేతలకు ఏపీపై తెగ ప్రేమ పుట్టుకొచ్చింది. బీజేపీ జాతీయ నేతలు ఏపీ మీద తెగ ప్రేమ కురిపిస్తున్నారు. వరుస పర్యటనలు చేస్తున్నారు. వరుసగా మీటింగ్ లు పెడుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే ఏకంగా ఏపీని టార్గెట్ చేసి వచ్చే ఎన్నికల్లో ఏపీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న శ్రీకాళహస్తిలో.. బీజేపీ నేతలు మీటింగ్ పెట్టిన విషయం తెలుసు కదా. శ్రీకాళహస్తిలో […]

 Authored By kranthi | The Telugu News | Updated on :13 June 2023,11:00 am

Amit Shah : ఏంటో ఈ మధ్య బీజేపీ జాతీయ నేతలకు ఏపీపై తెగ ప్రేమ పుట్టుకొచ్చింది. బీజేపీ జాతీయ నేతలు ఏపీ మీద తెగ ప్రేమ కురిపిస్తున్నారు. వరుస పర్యటనలు చేస్తున్నారు. వరుసగా మీటింగ్ లు పెడుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే ఏకంగా ఏపీని టార్గెట్ చేసి వచ్చే ఎన్నికల్లో ఏపీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న శ్రీకాళహస్తిలో.. బీజేపీ నేతలు మీటింగ్ పెట్టిన విషయం తెలుసు కదా. శ్రీకాళహస్తిలో బీజేపీ నేతలు ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపించారు.

తాజగా వైజాగ్ రైల్వే గ్రౌండ్స్ లో మీటింగ్ పెట్టిన అమిత్ షా.. మరోసారి ఏపీ ప్రభుత్వంపై ఎక్కు పెట్టారు. ఏపీ ప్రభుత్వం వల్లనే ప్రగతి కనిపించడం లేదంటూ ఆయన ఆరోపణలు చేశారు. అసలు బీజేపీ పార్టీకి ఏపీ మీద ఎంత ప్రేమ లేకపోతే.. నిధులు ఎందుకు ఇస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు. రెవెన్యూ లోటు నిధులు, పోలవరం నిధులు వేల కోట్లను ఏపీకి ఇచ్చాం అంటూ తమ గొప్పలు చెప్పుకున్నారు అమిత్ షా.

amit shah direct attack on ap cm ys jagan

amit shah direct attack on ap cm ys jagan

Amit Shah :ఏపీలో 25 ఎంపీ సీట్లు బీజేపీకి ఇచ్చేయాలట

ఏపీలో బీజేపీని బలోపేతం చేయడం కోసం.. అధికార వైసీపీ పార్టీపై లేనిపోని బురద జల్లారు అమిత్ షా. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తేనే ఏపీలో పూర్తి స్థాయి అభివృద్ధి జరుగుతుంది అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఏపీలో 25 ఎంపీ సీట్లు ఉన్నాయి. పాతిక ఎంపీ సీట్లు ఉన్నాయి కానీ.. 20 దాకా సీట్లు బీజేపీకి ఇవ్వాలని.. బీజేపీని ఏపీలో గెలిపిస్తేనే ఏపీ అభివృద్ధి అన్నట్టుగా ఆయన మాట్లాడారు. బీజేపీ నేతలు తాము ఏపీకి ఏం చేశామో చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్నారు కానీ.. ఏపీని సీఎం జగన్ ఎంత అభివృద్ధి చేశారు.. ఏపీలో ఎన్ని సంక్షేమ పథకాలను తీసుకొచ్చామో మాత్రం చెప్పలేకపోయారు. కేవలం బురద జల్లే రాజకీయాలకు బీజేపీ నేతలు తెర తీశారు అనడానికి తాజాగా జరిగిన ఈ మీటింగ్ లే ఉదాహరణ.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది