Anil Kumar Yadav : నేను ఎక్కడికీ పారిపోలేదు – వైసీపీ లీడర్ క్లారిటీ..!

Authored By Ramalingaiah Tandu | The Telugu News | Updated on: May 4, 2025, 6:41 pm
  •  Anil Kumar Yadav : నేను ఎక్కడికీ పారిపోలేదు - వైసీపీ లీడర్ క్లారిటీ..!

Anil Kumar Yadav : నెల్లూరు జిల్లాలో మైనింగ్ మూసివేతపై మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఓటమి అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న అనిల్ యాదవ్ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి, నెల్లూరులో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. తనపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇస్తూ.. “నేను ఎక్కడికీ పారిపోలేదు. వ్యక్తిగత కారణాల వల్ల 10 నెలలుగా రాజకీయాలకు విరామం తీసుకున్నాను” అని తెలిపాడు. నెల్లూరులో మైనింగ్ మూసివేతపై ఘాటుగా స్పందించిన ఆయన, ప్రభుత్వం యాదృచ్ఛికంగా కొంతమాత్రం గనులను తెరిచి, మిగిలిన వాటిని మూసివేయడం వల్ల వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోతున్నాయన్నారు.

Anil Kumar Yadav : నేను ఎక్కడికీ పారిపోలేదు - వైసీపీ లీడర్ క్లారిటీ..!

Anil Kumar Yadav : నేను ఎక్కడికీ పారిపోలేదు – వైసీపీ లీడర్ క్లారిటీ..!

Anil Kumar Yadav : నెల్లూరులో మైన్ల మూసివేత..వైసీపీ లీడర్ ఆగ్రహం

గత వైసీపీ ప్రభుత్వంలో మైనింగ్ పై దోపిడీ జరిగింది అనే ఆరోపణలు అర్ధరహితమని, అప్పుడే అక్రమ మైనింగ్ పై 255 కోట్ల రూపాయల జరిమానాలు విధించామని అన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో పలు మైన్లను మూసివేసి, కొద్దిమాత్రమే తెరిచారని ఆరోపించారు. “జిల్లాలో సుమారు 100 యాక్టివ్ మైన్స్ ఉండగా, వీటిలో కేవలం 30 మైన్లను మాత్రమే ఓపెన్ చేశారు. పెనాల్టీ లేనివి మూసి, ఉన్నవే ఓపెన్ చేశారు” అని ఆరోపిస్తూ, దీని వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గి, దాదాపు 10 వేల మంది ఉపాధి కోల్పోయారని వివరించారు.

అదే సమయంలో మైనింగ్ ఓనర్లు కోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తూ, కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఫిబ్రవరి 10 నాటికి చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్పినా, ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. దీనివల్ల కోర్టు ధిక్కార పిటిషన్లు కూడా దాఖలయ్యాయని తెలిపారు. మైనింగ్ పై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాది మంది ఈ చర్యల వల్ల నష్టపోతున్నారని, ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి మైన్లను తిరిగి ప్రారంభించాలని సూచించారు.

Ramalingaiah Tandu

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp