Anil kumar yadav : నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ కి టికెట్ క్యాన్సిల్ .. సర్దుకోక తప్పదు అంటున్న వై.యస్.జగన్మోహన్ రెడ్డి..!
ప్రధానాంశాలు:
Anil kumar yadav : నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ కి టికెట్ క్యాన్సిల్ .. సర్దుకోక తప్పదు అంటున్న వై.యస్.జగన్మోహన్ రెడ్డి..!
Anil kumar yadav : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో గెలుపే లక్ష్యంగా ఉండగలిగే వారు మాత్రమే తనకు సపోర్టింగ్ గా ఉండే వాళ్ళు లేదంటే ఎవరైనా ఓడిపోయి పరిస్థితి ఉంటే స్థాన చలనం ఉంటే లేదంటే ఇన్ ఛార్జిలను మారుస్తారని వారికి ఏమాత్రం మోహమాటం లేకుండా చెబుతున్నారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎడాపెడా మార్చేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఎవరైనా సరే ఎంత పెద్ద తోపు అయినా సరే గెలవడం తనకు ముఖ్యం అని జగన్ తన చేతల ద్వారా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో కొత్త ఇన్ ఛార్జ్ లను నియమించారు. త్వరలోనే సెకండ్ లిస్ట్ రాబోతుంది. భవిష్యత్తులో అనేక మందిని ట్రాన్స్ఫర్ చేయడానికి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి రెడీ అవుతున్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎద్దేవా చేసినా, చేతకానితనం అనుకున్నా, ఓటమి భయం అని భావించినా సరే తను అనుకున్న మార్పులు చేయడానికి సిద్ధం అయిపోతున్నారు.
అందులో భాగంగానే నెల్లూరు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను కూడా తప్పిస్తారని వార్తలు వస్తున్నాయి. నెల్లూరు పట్టణ నియోజకవర్గం నుంచి రెండుసార్లు అనిల్ కుమార్ యాదవ్ విజయం సాధించారు. వైసీపీకి అధికారంలోకి రాగానే నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. రెండవ విడత మంత్రి వర్గ విస్తరణ లో ఆయన పదవిని కోల్పోయారు. గత ఎన్నికల్లో ఆయన మాజీ మంత్రి నారాయణ మీద స్వల్ప మెజారిటీతో గెలిచారు. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ వే ఎక్కువగా ఉండడంతో అనిల్ కుమార్ యాదవ్ గెలిచారని కామెంట్స్ వచ్చాయి. లేకపోతే నారాయణ గెలిచేవాడని అంతకుముందు అన్నారు. అందుకే మరోసారి అనిల్ కుమార్ యాదవ్ నీ అక్కడ పోటీ చేపించే సాహసం చేయడం లేదని పార్టీ వర్గాల నుంచి సమాచారం.
నెల్లూరు నగర్ లో టీడీపీ తో పాటు జనసేన కూడా బలంగా ఉంది. ఓ సామాజిక వర్గం ఓట్లు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి. టీడీపీ తో జనసేన పొత్తు కుదరడంతో అనిల్ కుమార్ గెలవాలంటే ఆయన నియోజకవర్గం నుంచి తప్పించడం తప్ప వై. ఎస్. జగన్మోహన్ రెడ్డికి మరో మార్గం లేదు. అలా అని అనిల్ కుమార్ ని పార్టీ వదులుకో కూడదు అనే అభిప్రాయంతో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. ఆయనను వదులుకోవడం ఇష్టం లేని వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఈసారి ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి పోటీ చేపించాలని భావిస్తున్నట్లు టాక్. అక్కడ బుర్రా మధుసూదన్ యాదవ్ పై వ్యతిరేకత ఉండడం సామాజిక వర్గ ఓట్లతో పాటు రెడ్డీస్ కూడా ఎక్కువగా ఉండడంతో అనిల్ ను కనిగిరి కి షిఫ్ట్ చేస్తామని అంటున్నారు. అయితే దీనికి అనిల్ కుమార్ అంగీకరిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. నెల్లూరు నగర్ నియోజకవర్గం కన్నా కనిగిరి నియోజకవర్గం సేఫ్ ప్లేస్ అన్నది వాస్తవం.