YS Jagan : క్యాడర్ మొత్తం జగన్ ని వదిలేశారు .. అక్కడ దారుణంగా వీక్ అయిపోయిన వైసీపీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : క్యాడర్ మొత్తం జగన్ ని వదిలేశారు .. అక్కడ దారుణంగా వీక్ అయిపోయిన వైసీపీ

 Authored By siddhu | The Telugu News | Updated on :11 March 2026,9:00 pm

ప్రధానాంశాలు:

  •  YS Jagan : క్యాడర్ మొత్తం జగన్ ని వదిలేశారు.. అక్కడ దారుణంగా వీక్ అయిపోయిన వైసీపీ..!

YS Jagan : ప్రకాశం జిల్లా రాజకీయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి కంచుకోటలా ఉన్న ఈ జిల్లాలో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని నమ్ముకుని ఉన్న క్యాడర్ అంతా ఇప్పుడు జగన్ పక్కన ఉండాలా వద్దా అనే ఆలోచనలో పడిపోయారు. జిల్లాలో పార్టీ నిర్మాణం మొత్తం కుప్పకూలిపోతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాయకులు ఉన్నా కూడా వారికి అండగా నిలబడే కార్యకర్తలు కరువయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తామై చూసుకున్న వారు కూడా ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

YS Jagan క్యాడర్ మొత్తం జగన్ ని వదిలేశారు అక్కడ దారుణంగా వీక్ అయిపోయిన వైసీపీ

YS Jagan : క్యాడర్ మొత్తం జగన్ ని వదిలేశారు.. అక్కడ దారుణంగా వీక్ అయిపోయిన వైసీపీ..!

YS Jagan ముక్కలవుతున్న వైసీపీ కోట

ప్రకాశం జిల్లాలో వైసీపీ వీక్ అయిపోవడానికి ప్రధాన కారణం నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం మరియు క్యాడర్ ను పట్టించుకోకపోవడం. ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా మంది కీలక నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. కొందరు నేతలు ఇతర పార్టీల వైపు చూస్తుంటే మరికొందరు రాజకీయాలకే దూరంగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో కార్యకర్తలను సమన్వయం చేసే నాథుడే లేకుండా పోయాడు. జిల్లాలో పార్టీకి అండగా నిలబడాల్సిన కీలక సామాజిక వర్గాలు కూడా ఇప్పుడు వైసీపీకి దూరంగా జరుగుతున్నాయి. పార్టీని నమ్ముకుంటే భవిష్యత్తు లేదని భావించిన ద్వితీయ శ్రేణి నాయకులు పక్క పార్టీల్లో చేరుతుండటంతో జగన్ కు ఇక్కడ పెద్ద దెబ్బ తగిలింది.

జగన్ వైఖరి పట్ల కూడా క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కష్టకాలంలో తమను ఆదుకునే వారు లేరని గెలిచినప్పుడు మాత్రమే కనిపించి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. జిల్లాలో గతంలో ఉన్న పట్టును వైసీపీ పూర్తిగా కోల్పోయింది. మున్సిపల్ ఎన్నికల నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు గ్రాఫ్ పడిపోతూనే వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని మళ్ళీ గాడిలో పెట్టడం అనేది మామూలు విషయం కాదు. జిల్లాలో పార్టీ యంత్రాంగం మొత్తం స్తంభించిపోయింది. కార్యకర్తలు నైతికంగా దెబ్బతినడం నాయకులు ఎవరికి వారు యమునా తీరే అన్నట్టు వ్యవహరించడం వల్ల ప్రకాశం జిల్లాలో వైసీపీ అడ్రస్ లేకుండా పోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే అక్కడ క్యాడర్ మొత్తం జగన్ ని వదిలేసి తమ దారి తాము చూసుకుంటున్నారు.

siddhu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది