Ys Jagan : జగన్ కుటుంబం లోంచి ఒక తోపుగాడు దిగితున్నాడు !

Advertisement

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో చోటు చేసుకుంటున్న పరిణామాలు అనేక సంచలనాలకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ ఇప్పటికే కొన్నిసార్లు విచారణ చేయడం జరిగింది. త్వరలో అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని వైసీపీ నాయకుల సైతం తెలియజేస్తూ ఉన్నారు. కచ్చితంగా అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయటం గ్యారెంటీ అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇటువంటి పరిణామాలతో కడప రాజకీయాల్లో సరికొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మామూలుగానే కడప వైయస్ ఫ్యామిలీకి కంచుకోట అని అందరికీ తెలుసు.

another political successor is coming from jagans family
another political successor is coming from jagans family

ఒకవేళ సిబిఐ వైయస్ అవినాష్ రెడ్డి ని అరెస్ట్ చేస్తే మాత్రం.. వచ్చే ఎన్నికలలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండటంతో ఈలోపే జగన్ కుటుంబం నుండి తోపు లాంటి వ్యక్తి రంగంలోకి దిగటం జరిగింది. ఆ వ్యక్తి మరెవరో కాదు వైయస్ అభిషేక్ రెడ్డి. ఇప్పటికే అభిషేక్ పులివెందుల నియోజకవర్గం లోని సింహాద్రిపురం, లింగాల మండలాలకు ఇన్చార్జిగా ఉన్నారు. వైజాగ్ లో డాక్టర్ గా పనిచేస్తున్న అభిషేక్ ను జగన్ పిలిచి పార్టీ బాధ్యతలను అప్పగించారు. డాక్టర్ గా కూడా మండలాల్లో రెగ్యులర్ గా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఎంపీతో కలిసి డాక్టర్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అవినాష్ రెడ్డితో కలిసి అభిషేక రెడ్డి పర్యటించటం మీడియాతో మాట్లాడటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Advertisement

ఈ పరిణామరణాలన్నీ చూస్తే పరోక్షంగా వైయస్ అవినాష్ రెడ్డి తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులు దృష్ట్యా.. తన స్థానాన్ని అభిషేక రెడ్డి భర్తీ చేయబోతున్నట్లు మంగళవారం మీడియా సముఖంగా తెలియజేసినట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వివేక కేసులో నుండి బయట పెడితే మళ్లీ అవినాష్ రెడ్డి పోటీ చేయటం గ్యారెంటీ.. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఒకవేళ వచ్చే ఎన్నికల నాటికి హత్య కేసులో క్లీన్ చిట్ రాకపోతే అరెస్టులో ఉన్న అవినాష్ కి ప్రత్యామ్నాయంగా అభిషేక రెడ్డి బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఇద్దరూ కూడా జగన్ కి బాగా సన్నిహితులే. దీంతో ఇద్దరిలో ఒకరు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని జిల్లా రాజకీయాల్లో ప్రచారం జరుగుతుంది.

Advertisement
Advertisement