AP : మంత్రి కొడుకు పొలిటికల్ ఎంట్రీ.. ఆ నియోజకవర్గం నుంచే టికెట్ గ్రీన్ సిగ్నల్..?
AP : రాజకీయాల్లో వారసత్వం అనేది కామన్. చాలామంది రాజకీయ నేతలు తమ వారసులను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇప్పిస్తున్నారు. ఏపీలో సీఎం జగన్ కూడా తన పార్టీ సీనియర్ నేతల ఫ్యామిలీల నుంచి రాజకీయ నాయకులు వస్తున్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. రాజకీయ వారసులకు సీఎం జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో సీనియర్ నాయకులంతా తమ వారసులను రంగంలోకి దించుతున్నారు.
విజయనగరం జిల్లా చూసుకుంటే అలాగే ఉంది. విజయనగరం జిల్లా మంత్రి బొత్స జిల్లా. ఆ జిల్లాను 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలుసు కదా. అక్కడ ఉన్న వైసీపీ నేతల్లో ఎక్కువ మంది ఆయనకు సన్నిహితులే. ఇప్పుడు తన సొంత కొడుకు బొత్స సందీప్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. బొత్స సందీప్ డాక్టర్ చదివారు. ఆయన రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ అధిష్ఠానం బొత్సను కోరిందట. దీంతో తన కొడుకుకి చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కండిషన్ పెట్టారట.బొత్స ఈసారి ఎంపీగా పోటీ చేస్తే.. బొత్స సందీప్ కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని షరతు పెట్టడంతో దానికి సీఎం జగన్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అంటే.. ఈసారి బొత్స సందీప్ ఎన్నికల్లో పోటీ చేయడం కన్ఫమ్ అయినట్టే. విజయనగరం నుంచి ఎంపీగా బొత్స పోటీ చేయనున్నారు.
AP : బొత్స సందీప్ కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్
అదే చీపురుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున కిమిడి నాగార్జున పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. కిమిడి నాగార్జున కూడా యువకుడే. అంతే కాదు.. బొత్స సందీప్, కిమిడి నాగార్జున ఇద్దరూ స్నేహితులే. ఇద్దరూ ఒకే నియోజకవర్గం నుంచి వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. చూద్దాం మరి.. విజయనగరంలో బొత్స సత్యనారాయణ, ఆయన కొడుకు రాజకీయాలు ఎంత దూరం వెళ్తాయో.. తను గెలిచి తన కొడుకును బొత్స గెలిపించుకుంటారా లేదా వేచి చూడాల్సిందే.