AP Budget : ఏపీ వార్షిక బడ్జెట్ రూ.3.22 లక్షల కోట్లు
AP Budget Allocations : ఆంధ్రప్రదేశ్‌లోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) ప్రభుత్వం శుక్రవారం (ఫిబ్రవరి 28, 2025) నాడు 2025-26 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు ఒకే రోజు ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆంధ్రప్రదేశ్‌లో ఆచారంగా వస్తోంది.
AP Budget : ఏపీ వార్షిక బడ్జెట్ రూ.3.22 లక్షల కోట్లు
బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలలో చాలా ఆసక్తిని రేకెత్తించింది మరియు రాష్ట్ర ప్రభుత్వం తెలుగు దేశం పార్టీ (TDP) మరియు జనసేన పార్టీ (JSP) ఇచ్చిన కీలకమైన ఎన్నికల వాగ్దానాలు అయిన ‘సూపర్ సిక్స్’ను అమలు చేస్తుందనే ఆశలు ఎక్కువగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ రికార్డు స్థాయిలో రూ.3.22లక్షల కోట్లతో ఖరారు చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రెవెన్యూ లోటు 38,682 కోట్ల రూపాయలు ఉంటే ద్రవ్యలోటు రూ. 62,719 కోట్లుగా కాగ్ ధృవీకరించింది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జి.ఎస్.డి.పి.) లో రెవెన్యూ లోటు మరియు ద్రవ్యలోటు వరుసగా 2.72 శాతంగానూ, 4.41 శాతంగానూ ఉన్నాయి.
– అమరావతి నిర్మాణానికి రూ.6,000 కోట్లు
– రోడ్ల నిర్మాణం, మరమ్మతులు రూ.4,220 కోట్లు
– పోర్టులు, ఎయిర్‌పోర్టులు రూ.605 కోట్లు
– ఆర్టీజీఎస్‌కు రూ.101 కోట్లు
– ఐటీ, ఎలక్ట్రానిక్స్‌కు రాయితీలు రూ.300 కోట్లు
– NTR భరోసా పెన్షన్ రూ.27,518 కోట్లు
– ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు
– మనబడి పథకానికి రూ.3,486 కోట్లు
– తల్లికి వందనం పథకానికి రూ.9,407 కోట్లు
– దీపం 2.O పథకానికి రూ.2,601 కోట్లు
– బాల సంజీవని పథకానికి రూ.1,163 కోట్లు
– చేనేత, నాయీబ్రాహ్మణుల ఉచితవిద్యుత్‌కు రూ.450కోట్లు
– ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్‌షిప్‌లకు రూ.3,377కోట్లు
– స్వచ్ఛ ఆంధ్రకు రూ.820 కోట్లు
– ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్‌కు రూ.400 కోట్లు
– అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6,300 కోట్లు
– ధరల స్థిరీకరణ నిధి రూ.300 కోట్లు
– సాగునీటి ప్రాజెక్టులకు రూ.11,314 కోట్లు
– పోలవరం నిర్మాణానికి రూ.6,705 కోట్లు
– జల్‌జీవన్ మిషన్‌కు రూ.2,800 కోట్లు
– రాష్ట్రీయ కృషి వికాస్ యోజన రూ.500 కోట్లు
– తల్లికి వందనం పథకానికి బడ్జెట్‌లో రూ. 8,276 కోట్లను కేటాయించారు. తల్లికి వందనం అమలుకు 12 వేల కోట్లకు అవసరం కానుండగా నిధులు తగ్గించికేటాయించారు. దీపం పథకంలో కూడా కోతలు విధించారు. కోటి 55 లక్షల మంది లబ్ధిదారులను 90 లక్షలకు కుదించారు. బడ్జెట్ లో రూ.2,601కోట్లను కేటాయించారు.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్‌కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్‌కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.