AP Budget Allocations : శాఖల వారీగా ఏపీ బడ్జెట్‌ కేటాయింపులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP Budget Allocations : శాఖల వారీగా ఏపీ బడ్జెట్‌ కేటాయింపులు

 Authored By prabhas | The Telugu News | Updated on :28 February 2025,12:01 pm

ప్రధానాంశాలు:

  •  AP Budget Allocations : శాఖల వారీగా ఏపీ బడ్జెట్‌ కేటాయింపులు

AP Budget Allocations : ఆంధ్రప్రదేశ్‌లోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) ప్రభుత్వం శుక్రవారం (ఫిబ్రవరి 28, 2025) నాడు 2025-26 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సాధారణ బడ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌గా, వ్యవసాయ శాఖ‌ మంత్రి కె. అచ్చెన్నాయుడు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టారు. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు ఒకే రోజు ప్రత్యేక బడ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డం ఆంధ్రప్రదేశ్‌లో ఆచారంగా వస్తోంది.

AP Budget ఏపీ వార్షిక బ‌డ్జెట్ రూ322 లక్షల కోట్లు

AP Budget : ఏపీ వార్షిక బ‌డ్జెట్ రూ.3.22 లక్షల కోట్లు

బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలలో చాలా ఆసక్తిని రేకెత్తించింది మరియు రాష్ట్ర ప్రభుత్వం తెలుగు దేశం పార్టీ (TDP) మరియు జనసేన పార్టీ (JSP) ఇచ్చిన కీలకమైన ఎన్నికల వాగ్దానాలు అయిన ‘సూపర్ సిక్స్’ను అమలు చేస్తుందనే ఆశలు ఎక్కువగా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్ రికార్డు స్థాయిలో రూ.3.22లక్షల కోట్లతో ఖరారు చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రెవెన్యూ లోటు 38,682 కోట్ల రూపాయలు ఉంటే ద్రవ్యలోటు రూ. 62,719 కోట్లుగా కాగ్‌ ధృవీకరించింది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జి.ఎస్.డి.పి.) లో రెవెన్యూ లోటు మరియు ద్రవ్యలోటు వరుసగా 2.72 శాతంగానూ, 4.41 శాతంగానూ ఉన్నాయి.

శాఖల వారీగా కేటాయింపులు

– అమరావతి నిర్మాణానికి రూ.6,000 కోట్లు
– రోడ్ల నిర్మాణం, మరమ్మతులు రూ.4,220 కోట్లు
– పోర్టులు, ఎయిర్‌పోర్టులు రూ.605 కోట్లు
– ఆర్టీజీఎస్‌కు రూ.101 కోట్లు
– ఐటీ, ఎలక్ట్రానిక్స్‌కు రాయితీలు రూ.300 కోట్లు
– NTR భరోసా పెన్షన్‌ రూ.27,518 కోట్లు
– ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు
– మనబడి పథకానికి రూ.3,486 కోట్లు
– తల్లికి వందనం పథకానికి రూ.9,407 కోట్లు
– దీపం 2.O పథకానికి రూ.2,601 కోట్లు
– బాల సంజీవని పథకానికి రూ.1,163 కోట్లు
– చేనేత, నాయీబ్రాహ్మణుల ఉచితవిద్యుత్‌కు రూ.450కోట్లు
– ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్‌షిప్‌లకు రూ.3,377కోట్లు
– స్వచ్ఛ ఆంధ్రకు రూ.820 కోట్లు
– ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్‌కు రూ.400 కోట్లు
– అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6,300 కోట్లు
– ధరల స్థిరీకరణ నిధి రూ.300 కోట్లు
– సాగునీటి ప్రాజెక్టులకు రూ.11,314 కోట్లు
– పోలవరం నిర్మాణానికి రూ.6,705 కోట్లు
– జల్‌జీవన్‌ మిషన్‌కు రూ.2,800 కోట్లు
– రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన రూ.500 కోట్లు
– తల్లికి వందనం పథకానికి బడ్జెట్‌లో రూ. 8,276 కోట్లను కేటాయించారు. తల్లికి వందనం అమలుకు 12 వేల కోట్లకు అవసరం కానుండగా నిధులు తగ్గించికేటాయించారు. దీపం పథకంలో కూడా కోతలు విధించారు. కోటి 55 లక్షల మంది లబ్ధిదారులను 90 లక్షలకు కుదించారు. బడ్జెట్ లో రూ.2,601కోట్లను కేటాయించారు.

Advertisement
WhatsApp Group Join Now

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది