Chandrababu : ఏపీకి కొత్త సీఎం.. చంద్రబాబుని దించుతున్నారా.. దిగుతున్నారా..?
ప్రధానాంశాలు:
Chandrababu : ఏపీకి కొత్త సీఎం.. చంద్రబాబుని దించుతున్నారా.. దిగుతున్నారా..?
Chandrababu : ఏపీకి కొత్త సీఎం.. అదేంటి మొన్నే కదా సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ఎంపికయ్యారు. ఇప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాలుగోసారి సీఎం గా ఎన్నికయ్యారు. ఇలా ఒక ప్రాతీయ పార్టీ నేత 4 సార్లు సీఎం గా చేయడం ఒక అరుదైన రికార్డ్. ఆ రికార్డుని తన ఖాతాలో వేసుకున్నారు చంద్రబాబు. అంతేకాదు 3సార్లు ప్రతి పక్ష నేతగా ఉన్న రికార్డ్ కూడా ఆయనదే. అఫ్కోర్స్ ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఆయనకు ఇవన్నీ సాధ్యం అయ్యాయని చెప్పొచ్చు.
ఐతే టీడీ ఈసారి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. పోటీ చేసిన 144 సీట్లలో 135 సీట్లు అంటే స్ట్రైక్ రేట్ విషయంలో కూడా ఇది రికార్డ్ అనే చెప్పొచ్చు. ఆంధ్రా విడిపోయి పదేళ్లు అవుతున్నా ఇప్పటికీ సరైన మార్గ దర్శకత్వం లేకుండా వెళ్తుంది. అందుకే ఆంధ్రా ప్రజలు చంద్రబాబుని సీఎం చేశారు. ఐతే మళ్లీ 2029 లో కూడా చంద్రబాబునే ఎన్నుకుంటేనే ఆంధ్రా బాగుపడుతుందని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రా ప్రదేశ్ అభివృద్ధికి ఎలా లేదన్నా పదేళ్లు టైం పడుతుంది.నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా టీడీని గెలిపిస్తేనే అది సాధ్యమవుతుందని అంటున్నారు. ఐతే లేటెస్ట్ గా జీసీ దివాకర్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో సీఎం గా చంద్రబాబు ఈసారి ఐదేళ్లు పరిపాలన చేయడని ఆయన వారసుడు లోకేష్ ని సీఎం సీటులో కూర్చోబెడతాడని అంటున్నారు. మెజారిటీ స్ట్రైక్ రేటు పరంగా ఈసారి టీడీపీకి బాగా వచ్చాయి కానట్టి అధినేత చెప్పింది పార్టీ నేతలు ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది.
ఈ క్రమంలో బాబు సీఎం గా తొలగిపోయి లోకేష్ ని సీఎం చేస్తానన్నా పార్టీ నేతలు ఒప్పుకునే అవకాశం ఉంటుంది. అయితే పార్టీలో సీనియర్లనే కాస్త సముదాయించాల్సిన అవసరం ఉంటుంది. ఐతే ఈ టర్మ్ కుదరకపోతే నెక్స్ట్ గెలిస్తే మాత్రం శాసన సభా పక్ష నేతగా లోకేష్ ని డైరెక్ట్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. పార్టీ ని కూడా నడిపించాల్సిన బాధ్యత బాబు మీద ఉంది కాబట్టి సీఎం గా కొడుకుని ఎప్పుడు వీలుంటే అప్పుడు టైం చూసి కూర్చో బెడతాడని అంటున్నారు. జేసీ దీని గురించి చెప్పకనే చెప్పినట్టు చెప్పడం అందరిని ఆలోచనలో పడేస్తుంది.