Chandrababu Naidu : మంత్రులుగా వాళ్ళందరూ ఫెయిల్ ? చంద్రబాబు రిపోర్ట్ కార్డ్ ?
ప్రధానాంశాలు:
Chandrababu Naidu : మంత్రులుగా వాళ్ళందరూ ఫెయిల్ ? చంద్రబాబు రిపోర్ట్ కార్డ్ ?
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏమిటంటే చంద్రబాబు నాయుడు తన కేబినెట్ లో భారీ మార్పులు చేయబోతున్నారన్న వార్త. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్న తరుణంలో మంత్రుల పనితీరుపై చంద్రబాబు ఒక క్లారిటీకి వచ్చేశారు. జూన్ నాటికి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న క్రమంలో అంతకంటే ముందే అంటే ఈ ఉగాది నాటికే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుత కేబినెట్ లోని చాలామంది మంత్రుల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని అందుకే రిపోర్ట్ కార్డులు సిద్ధం చేసిన బాబు ఈసారి సీనియర్లకు పెద్దపీట వేయాలని డిసైడ్ అయ్యారట. తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులు అయిన వారు క్షేత్రస్థాయిలో పార్టీని జిల్లా నాయకత్వాన్ని సమన్వయం చేయడంలో విఫలం అయ్యారనేది బాబు ప్రధాన అసంతృప్తిగా కనిపిస్తోంది.
Chandrababu Naidu : మంత్రులుగా వాళ్ళందరూ ఫెయిల్ ? చంద్రబాబు రిపోర్ట్ కార్డ్ ?
Chandrababu Naidu : పనితీరు బాగోలేకపోతే ఇంటికే
ప్రస్తుత మంత్రివర్గంలో ఎక్కువ మంది కొత్త వారే ఉన్నారు. వీరికి అవకాశం ఇస్తే పార్టీ భవిష్యత్తు బాగుంటుందని బాబు ఆలోచించారు కానీ ఫలితం మాత్రం తారుమారు అయ్యింది. మంత్రులు తమ జిల్లాలపై పట్టు సాధించలేకపోవడం అలాగే ఎమ్మెల్యేలను సరైన మార్గంలో నడిపించలేకపోవడం వంటి కారణాలతో పాలనలో వేగం తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలకు వెళ్లడం కష్టమని భావిస్తున్న బాబు ఐదారు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన అనుభవం ఉన్న సీనియర్లను కేబినెట్ లోకి తీసుకుని వారికి జిల్లా బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు. దాదాపు 48 మంది ఎమ్మెల్యేల పనితీరు కూడా చాలా అధ్వాన్నంగా ఉందని వారిలో చాలా మందిని మార్చే అవకాశం ఉందని సమాచారం. కనీసం నలుగురు ఐదుగురు మంత్రులను తప్పించి వారి స్థానంలో పాత తరం నేతలను తీసుకురావడం ద్వారా పార్టీలో క్రమశిక్షణ తీసుకురావాలని బాబు ప్లాన్ చేస్తున్నారు.
ఉగాది ముహూర్తం కుదరకపోతే శ్రీరామ నవమి తర్వాత కచ్చితంగా కేబినెట్ లో మార్పులు ఉంటాయని దీనివల్ల కొంతమంది మంత్రులకు పదవీ గండం పొంచి ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మొహమాటాలకు పోకుండా పని చేయని వారిని పక్కన పెట్టడమే ఇప్పుడు బాబు ముందున్న ఏకైక మార్గం. మంత్రులుగా ఫెయిల్ అయిన వారిని తప్పించి పార్టీని గాడిలో పెట్టేందుకే బాబు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. సీనియర్ల రాకతోనైనా ప్రభుత్వానికి పార్టీకి మధ్య ఉన్న గ్యాప్ తగ్గుతుందని క్యాడర్ లో కొత్త ఉత్సాహం వస్తుందని బాబు నమ్ముతున్నారు. మొత్తానికి బాబు ఇచ్చిన రిపోర్ట్ కార్డు ఇప్పుడు మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.