YS Jagan : ఈ రోజు, రేపు, ఎల్లుండి.. జగన్ కి చాలా ముఖ్యమైన టైం.. ఏం జరగబోతోంది !
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ తన సొంత జిల్లా పర్యటన చేయనున్నారు. ఆయన కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈరోజు నుంచి అంటే జులై 8 నుంచి జులై 10 వరకు ఆయన మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇవాళ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఇవాళ మొత్తం ఇడుపులపాయలోనే సీఎం జగన్ పర్యటన ఉండనుంది.
ఇక.. జులై 9న అంటే ఆదివారం గండికోట, పులివెందులలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఇక.. జులై 10న కడప నగరంలో పర్యటించనున్నారు. కొప్పర్తి పారిశ్రామికవాడను సందర్శించి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. జులై 9న సీఎం జగన్ ఉదయం 9.20 కే గండికోట హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడ 9.30 కి ఒబెరాయ్ హోటల్ లో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10.25 కు బయలుదేరి 10.30 కు గండికోట హెలిప్యాడ్ కు చేరుకొని అక్కడ 11 కు పులివెందుల కొత్త మున్సిపల్ కార్యాలయ భవనం వద్దకు చేరుకుంటారు.ఇక.. జులై 10న సీఎం జగన్ ఉదయం 9.20 కే కడప ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 9.25 నుంచి 10 గంటల వరకు పలువురు ప్రజాప్రతినిధులతో సీఎం జగన్ సమావేశం అవుతారు. 10 కి అక్కడి నుంచి బయలుదేరి రాజీవ్ మార్గ్ కు వెళ్తారు.
YS Jagan : జులై 10న సీఎం జగన్ షెడ్యూల్ ఇదే
అక్కడ రోడ్డు ప్రారంభోత్సవంలో పాల్గొని ఆ తర్వాత రాజీవ్ పార్క్ కు వెళ్తారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం కొప్పర్తి హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడ అల్ డిక్సన్ యూనిట్ కు చేరుకుంటారు. పారిశ్రామిక యూనిట్ల శంకుస్థాపన చేసి అక్కడి నుంచి కడప విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి విమానంలో గన్నవరం వెళ్తారు. అక్కడి నుంచి 1.30 కి సీఎం తన నివాసానికి వెళ్తారు.