YS Jagan : హుటాహుటిన వైజాగ్ కి బయలుదేరిన జగన్ !
YS Jagan : ఏపీలో ప్రస్తుతం అందరి చూపు వైజాగ్ మీదనే ఉంది. దానికి కారణం.. వైజాగ్ ను పరిపాలన రాజధానిని చేయడం. ఏపీ సీఎం వైఎస్ జగన్ అందుకే వైజాగ్ మీద ఫోకస్ పెట్టారు. మరోసారి ఆయన వైజాగ్ టూర్ పెట్టుకున్నారు. ఇటీవలే ఆయన వైజాగ్ వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. మళ్లీ వారంలోనే వైజాగ్ కు పయనమయ్యారు. అయితే ఈ సారి వైజాగ్ టూర్ లో భాగంగా సీఎం పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసే అవకాశం ఉంది.
భీమిలీలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్, అలాగే ఎండాడ వద్ద కాపు భవనానికి శంకుస్థాపన చేయనున్నారు సీఎం జగన్. వైజాగ్ లో కమర్షియల్ కాంప్లెక్స్, ఎంవీపీ ఇండోర్ కాంప్లెక్స్, ఎరీనా ఫౌండేషన్ కి సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. అలాగే.. వైజాగ్ బీచ్ రోడ్డులో సీ హరియర మ్యూజియాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అలాగే.. అపోలో యాజమాన్యం ఏర్పాటు చేసిన క్యాన్సర్ ఆసుపత్రిని సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
YS Jagan : అపోలో క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించనున్న జగన్
అలాగే.. వైఎస్సార్ స్టేడియం దగ్గర ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. చాలా కార్యక్రమాలకు ఒకేసారి ప్రారంభోత్సవాలు ఉండటంతో సీఎం టూర్ కన్ఫమ్ అయింది. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన కాపు భవనం హామీని సీఎం జగన్ నెరవేర్చబోతున్నారు. కాపు భవనానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే.. భీమిలీలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం సీఎం జగన్ వైజాగ్ మీద ఫోకస్ పెట్టారు.. ఇవన్ని పనులను ప్రారంభించనున్నారు అంటే.. త్వరలోనే వైజాగ్ పరిపాలన రాజధాని కాబోతున్నదన్నమాట.