
AP Congress : YSR కుటుంబం లేకుంటే కాంగ్రెస్ గెలవలేదా..?
AP Congress : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాల లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడింది. ఇక ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం సాధించిన ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఉందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు దారి వారు చూసుకున్నారు. కొందరు టిడిపి పార్టీలో చేరగా మరికొందరు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరిపోయారు. దీంతో 2014 మరియు 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీట్ కూడా గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది. అంతేకాక గత తేడాది జరిగిన కర్ణాటక మరియు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారం సాధించి మంచి ఫామ్ లో ఉంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఏఐసీసీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణలో రాజకీయాలు చేసేందుకు వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల వైయస్సార్ తెలంగాణ అనే పార్టీని స్థాపించి పార్టీని ప్రజలలో తీసుకెళ్లేందుకు పాదయాత్ర కూడా చేపట్టారు. కానీ ఆ పార్టీకి ఆశించిన స్థాయి లో ప్రజల నుంచి మద్దతు లభించలేదు.దీంతో తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో షర్మిల పోటీ చేయకుండా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. దీంతో అప్పుడే షర్మిల కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. అయితే అప్పుడు షర్మిల తెలంగాణలోనే పనిచేస్తానని చెప్పడంతో ఆమె చేరిక వాయిదా పడిందని చెప్పాలి. అలాగే టిపిసిసి చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో షర్మిల రాజకీయాలను వ్యతిరేకించారు.
అనంతరం జనవరి 4న షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో పాటు వైయస్సార్ తెలంగాణ ను కాంగ్రెస్ లో విలీనం చేశారు.ఇక అదే రోజు షర్మిల మాట్లాడుతూ అధిష్టానం ఎలాంటి బాధ్యతలు ఇచ్చిన కచ్చితంగా నిర్వహిస్తానని తెలియజేశారు. ఆ సమయంలో అండమాన్ అయిన ఆంధ్రప్రదేశ్ లో అయినా పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు.అయితే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రెండు పర్యాయాలు పిసిసి చీప్ గా మరియు ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆ కాలంలో చతికిలబడిన కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఇక ఆనాడు టిడిపి పదేళ్ల పాలనతో కాంగ్రెస్ పూర్తిగా బలహీన పడిందని చెప్పాలి. ఇక ఆ సమయంలో పిసిసి చీఫ్ గా మగ్గాలు చేపట్టిన వైయస్సార్ ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర నిర్వహించారు. ఎండ వాన చలి అని తేడా లేకుండా ఆంధ్ర రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాటన్నిటిని పరిష్కరిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు.ఈ నేపథ్యంలోని 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. దీంతో ఆ సమయంలో వైయస్సార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, చేశారు.అనంతరం 2009లో కూడా సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. కానీ అదే ఏడాది హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర్ రెడ్డి మృతి చెందారు.
ఈ నేపథ్యంలోని తెలంగాణ ఉద్యమం ఊపొందుకొని 2014లో తెలంగాణ ఆవిర్భవించింది. అయితే రాష్ట్రాన్ని విభజించిందన్న కోపంతో ఆంధ్ర ప్రజలు అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ను చిత్తుచిత్తుగా ఓడించారు. ఆ సమయం లో టిడిపి అధికారంలోకి రాగా వైఎస్ఆర్సిపి 60 స్థానాలకు పరిమితమైంది. అనంతరం 2019లో జరిగిన ఎన్నికలలో ఏపీ ప్రజలు వైయస్ఆర్సీపీని 150 సీట్లతో గెలిపించి అధికారం ఇవ్వగా , టిడిపి 23 సీట్లకే పరిమితమైంది.అయితే 2024లో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం YSR వైయస్ ఫ్యామిలీనే నమ్ముకుంది. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కూతురు షర్మిలను పార్టీలో చేర్చుకుని ఆంధ్ర రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలిగా పగ్గాలు అప్పగించింది. ఈ మేరకు జనవరి 16న ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్న గిడుగు రుద్రరాజు రాజీనామా చేసిన 24 గంటల్లోనే షర్మిలకు ఈ పదవి అప్పగించడం విశేషం.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.