Farmers : రేషన్ కార్డు ఉన్న రైతులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం అదిరే కానుక!
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు గడ్డి కొరత, పోషకాహార లోపం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న రైతులకు ఇది భారీ ఊరటగా మారనుంది. ప్రభుత్వం హైప్రోటీన్ సమీకృత పశు దాణాను 50 శాతం రాయితీ ధరకు అందించేందుకు చర్యలు తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల పాల ఉత్పత్తిలో పెరుగుదల, పశువుల ఆరోగ్య పరిరక్షణతో పాటు రైతుల ఆర్థిక భారాన్ని కూడా తక్కువ చేయగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Farmers : రేషన్ కార్డు ఉన్న రైతులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం అదిరే కానుక!
ఈ పథకంలో భాగంగా నెల్లూరు జిల్లాకు మొత్తం 588 మెట్రిక్ టన్నుల పశు దాణా మంజూరైంది. ఇప్పటికే 250 మెట్రిక్ టన్నులు పంపిణీ చేయగా, మరో 169 మెట్రిక్ టన్నుల సరఫరా త్వరలోనే జరగనుంది. ఒక్కో 50 కిలోల బస్తా అసలు ధర రూ.1110 కాగా, రైతులకు అది రూ.555కే అందుబాటులో ఉంటుంది. ప్రారంభ దశలో ఒక్కో రైతుకు ఒక్క బస్తా ఇవ్వగా, తదుపరి రెండు విడతల్లో మరో రెండు బస్తాలు అందిస్తారు. ఒక్క రైతుకు రెండు పెద్ద పశువులు, ఒక దూడ ఉన్నట్టు లెక్కించి మొత్తం 150 కిలోల దాణా మంజూరు చేస్తారు.
ఈ రాయితీ పొందేందుకు రైతులు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. అలాగే చిన్న, సన్నకారు రైతులుగా గుర్తింపు ఉండటం అవసరం. రైతులు తమ పేర్లను సమీప రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలి. అర్హత ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ నిష్పత్తుల మేరకు పంపిణీ జరగనుంది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడమే కాకుండా, పాడి పరిశ్రమ అభివృద్ధికి గట్టి బలకేంద్రంగా మారనుంది.
Varalakshmi Kataksham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు పండితులు. ఇంకా,లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి…
Goji Berries : స్ట్రాబెర్రీ,చెర్రీ పండ్లు గురించి చాలామందికి తెలుసు.కానీ గోజీ బెర్రీల గురించి ఎప్పుడైనా విన్నారా... దీని గురించి…
Rakhi Festival : ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన రాఖీ పండుగ వచ్చినది. సోదరీ సోదరీమణులు ఎంతో ఆత్మీయంగా…
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
This website uses cookies.