AP Pension : గుడ్‌న్యూస్.. ఏపీలో ఇక వారికీ కూడా రూ.4,000 పెన్షన్..!
ప్రధానాంశాలు:
AP Pension : గుడ్‌న్యూస్.. ఏపీలో ఇక వారికీ కూడా రూ.4,000 పెన్షన్..!
AP Pension : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ విధానంలో మరో కీలక మార్పును తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఒకటో తేదీన పింఛన్ మంజూరు చేయడం, సెలవు దినం అయితే ముందే పంపిణీ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా తాజాగా మరణించిన పింఛన్ దారుల భార్యలకు ‘స్పౌజ్ పింఛన్’ పేరుతో నెలకు రూ.4,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య భర్తలు మరణించిన వితంతువులకు ఈ పథకం వర్తించనుంది. పింఛన్‌లు వచ్చే నెల నుంచి వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
AP Pension : గుడ్‌న్యూస్.. ఏపీలో ఇక వారికీ కూడా రూ.4,000 పెన్షన్..!
AP Pension : ఏపీలో ‘స్పౌజ్ పింఛన్’ పేరుతో వారికీ కూడా పెన్షన్ అందజేత
ఈ పథకం అమలుతో రాష్ట్రంలో సుమారు 89,788 మంది వితంతువులకు లబ్ధి చేకూరనుంది. దీనివల్ల ప్రభుత్వంపై నెలకు రూ.35.91 కోట్ల అదనపు భారం పడనుంది. జూన్ 12న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కొత్త పింఛన్ మొదలవుతుంది. గతంలో ప్రభుత్వం వితంతువు పింఛన్లను నిలిపివేయగా, కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించింది. భర్త మరణం తర్వాత కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని గుర్తించి, వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో స్పౌజ్ పింఛన్ పథకాన్ని ప్రారంభించింది.
దరఖాస్తుల ప్రక్రియలో ప్రభుత్వం కొన్ని నిరాకరణలు కూడా చేసింది. భార్య ఇప్పటికే పింఛన్ పొందడం, భార్యాభర్తలు ఇద్దరూ చనిపోవడం, ఒకే హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో లేనివారు, మరణ ధ్రువపత్రం లేకపోవడం, ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండటం, తిరిగి పెళ్లి చేసుకోవడం వంటి కారణాల వల్ల దరఖాస్తులను తిరస్కరించారు. అందుకు సంబంధించిన సమాచారం ప్రతి దరఖాస్తుతో పాటు ఇచ్చారు. ఇకపై భర్త మరణించిన వెంటనే దాని తదుపరి నెల నుంచి భార్యకు పింఛన్ అందేలా ప్రభుత్వం ప్రక్రియను వేగవంతం చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వివరాలు సేకరించి సెర్ప్ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.