AP 30 New Districts : ఏంటి.. ఏపీలో మళ్లీ జిల్లా పునర్‌వ్యవస్థీకరణ జరగనుందా .. ?
ప్రధానాంశాలు:
AP 30 New Districts : ఏంటి.. ఏపీలో మళ్లీ జిల్లా పునర్‌వ్యవస్థీకరణ జరగనుందా .. ?
AP 30 New Districts : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం మనం చూశాం. తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 13 జిల్లాలు 26 జిల్లాలుగా పెరిగాయి. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపించింది. కూటమి ప్రభుత్వం జిల్లాల్ని మరోసారి విభజించేందుకు సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. ఈసారి మొత్తం 30 జిల్లాలు ఏర్పాటు చేసే ప్రతిపాదన సిద్ధమైందని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినట్టుగా ప్రతిపాదన సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అయితే ఇది ఎంతవరకు నిజం అనే విషయంపై ప్రభుత్వం స్పందించింది.
AP 30 New Districts నిజం ఏంటి ?
కూటమి ప్రభుత్వం జిల్లాల్ని మరోసారి విభజించేందుకు సన్నాహాలు చేస్తోందని, మొత్తం 30 జిల్లాలు ఏర్పాటు చేసే ప్రతిపాదన సిద్ధమైందని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినట్టుగా ప్రతిపాదన సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. . ఓ వ్యక్తి ఇచ్చిన సలహాను ప్రభుత్వ నిర్ణయంగా ప్రకటించి సమాజంలో అశాంతి రేపేందుకు కొన్ని అల్లరి మూకలు ప్రయత్నిస్తున్నాయని..ఇదంతా పూర్తిగా అబద్ధమని ఖండించింది. ప్రస్తుతం వరకూ ప్రభుత్వం వద్ద జిల్లాల పునర్ వ్యవస్ధీకరణపై ఎలాంటి ప్రతిపాదనలు లేవని తెలిపింది. కొత్త జిల్లాల విషయంలో ప్రభుత్వం ఇప్పట్లో ఒక్క అడుగు కూడా ముందుకు వేయదని అంటున్నారు. అయితే రానున్న కాలంలో ప్రభుత్వం కొంత కుదుట పడిన తరువాత ఏమైనా ఆలోచన చేయవచ్చునేమో అన్నది కూడా ఉంది.
ఎన్టీఆర్ స్వస్థలమైన నిమ్మకూరు ఉన్న మచిలీపట్నం ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లాగా మార్చనున్నారు. ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ జిల్లాను తిరిగి కృష్ణా జిల్లాగా మారుస్తారు. వైఎస్సార్ జిల్లాను వైఎస్సార్ కడప జిల్లాగా మార్చుతున్నారు. ఎంత పద్ధతిగా విభజన చేసినా కూడా ప్రాంతం కంటే సెంటిమెంట్ వేరొకటి లేదు. అందువల్ల కొత్త జిల్లాల వ్యవహారం కూడా అలాంటిదే అని టీడీపీలోనూ ఉంది. పైగా కూటమి ఇపుడు అనేక సమస్యలతో సతమతమవుతోంది. ఈ నేపధ్యంలో కొత్త జిల్లాలతో కోరి తనకే ఇబ్బందులు తెచ్చుకుంటుందా అన్న చర్చ తెర మీదకు వచ్చింది..