Keesaragutta : కీసరగుట్టలో శ్రీ రామలింగేశ్వర స్వామికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Keesaragutta : కీసరగుట్టలో శ్రీ రామలింగేశ్వర స్వామికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు..!

 Authored By ramu | The Telugu News | Updated on :15 February 2026,10:00 pm

ప్రధానాంశాలు:

  •  Keesaragutta కీసరగుట్టలో శ్రీ రామలింగేశ్వర స్వామికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు..!

Keesaragutta : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు..కీసర రామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం వేలాది మంది భక్తులను ఆకర్షించే ప్రాచీన,ప్రాశస్త్యమైన ఆలయం అని మంత్రి పేర్కొన్నారు.

Keesaragutta కీసరగుట్టలో శ్రీ రామలింగేశ్వర స్వామికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు

Keesaragutta : కీసరగుట్టలో శ్రీ రామలింగేశ్వర స్వామికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు..!

రాష్ట్రంలోని అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు సౌకర్యవంతమైన రవాణా ఏర్పాట్లు కల్పించేందుకు రోడ్డు మార్గాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు..ఆర్&బి శాఖ ఆధ్వర్యంలో హ్యామ్ మోడల్ ద్వారా పలు ప్రధాన రహదారులను నిర్మించనున్నట్లు వెల్లడించారు.

దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు రోడ్డు నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తున్నామని,అలాగే హైదరాబాద్ నుండి శ్రీశైలం మల్లన్నను దర్శించుకునే భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు ఘాట్ రోడ్డులో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. పరమశివుని ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని,ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మంత్రి ప్రత్యేకంగా ప్రార్థించారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది