AP Liquor Scam Case : నెక్స్ట్ అరెస్ట్ ఆయనేనా..? వైసీపీ లో టెన్షన్ వాతావరణం !! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP Liquor Scam Case : నెక్స్ట్ అరెస్ట్ ఆయనేనా..? వైసీపీ లో టెన్షన్ వాతావరణం !!

 Authored By sudheer | The Telugu News | Updated on :22 August 2025,5:00 pm

AP Liquor Scam Case Update : ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కాం దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ కేసులో మాజీ ఎక్సైజ్ మంత్రి, నారాయణ స్వామిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు పలుమార్లు నోటీసులు పంపినా ఆరోగ్యం బాగోలేదని కారణం చెబుతూ విచారణకు దూరంగా ఉన్నారు. ఇటీవల కూడా నోటీసులు అందుకున్న తర్వాత వాట్సాప్ ద్వారా హెల్త్ సమస్యలు ఉన్నాయని సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు నేరుగా పుత్తూరు జిల్లాలోని ఆయన ఇంటికే వెళ్లి ప్రశ్నలు అడుగుతున్నట్లు సమాచారం.

YCP narayana swamy

YCP narayana swamy

గతంలో వీడియో కాల్ ద్వారా విచారణ జరిగినప్పుడు, తాను కేవలం మంత్రిగా అవసరమైన చోట సంతకాలు మాత్రమే చేశానని, పాలసీ మార్పులపై పూర్తి సమాచారం తన వద్ద లేదని నారాయణ స్వామి సమాధానం ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు నేరుగా ఆయనను ప్రశ్నిస్తున్న అధికారులు, ఎక్సైజ్ పాలసీ మార్పులో ఆయన పాత్ర ఏంటన్న దానిపై మరింత స్పష్టత సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. విచారణలో ఆయన సహకరించకపోతే అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

నారాయణ స్వామి ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పటికీ, ఒక్కరోజు కూడా సమీక్ష నిర్వహించినట్లు రికార్డులు లేవు. ఆయన ఎక్కువగా తన నియోజకవర్గానికే పరిమితమైపోయేవారు. కల్తీ లిక్కర్ స్కాం బయటకు వచ్చినప్పుడు కూడా ఆయన మీడియా ముందుకు రాకుండా, కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని ఆరోపణలు ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడైన కారణంగా పదవిలో కూర్చోబెట్టారని, కానీ అధికారాలు పెద్దగా ఇవ్వలేదని కూడా చెబుతున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారడంతో, జైలుశిక్షను ఎదుర్కొనే అవకాశం ఆయన ముందు నిలిచింది.

sudheer

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది