Roja – Renu Desai : పిల్లలను రాజకీయాల్లోకి లాగకండి.. రేణు దేశాయ్ వీడియోపై మంత్రి రోజా ఫైర్.. ఏమన్నారంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Roja – Renu Desai : పిల్లలను రాజకీయాల్లోకి లాగకండి.. రేణు దేశాయ్ వీడియోపై మంత్రి రోజా ఫైర్.. ఏమన్నారంటే?

 Authored By kranthi | The Telugu News | Updated on :13 August 2023,3:00 pm

Roja – Renu Desai : ఏపీ మంత్రి ఆర్కే రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేణు దేశాయ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు రేణు దేశాయ్ గురించి ఆమె ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది. ఆమె ఎప్పుడూ పవన్ కళ్యాణ్ నే కదా విమర్శించేది అంటారా? అవును నిజమే కానీ.. తాజాగా రేణు దేశాయ్ కూడా ఓ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో రిలీజ్ చేశారు. రాజకీయాల్లోకి పిల్లలను ఎందుకు లాగుతున్నారు. పవన్ కళ్యాణ్ పిల్లలు అయినంత మాత్రాన వాళ్లను రాజకీయాల్లోకి లాగకండి. వాళ్లకు రాజకీయాలు తెలియదు. ఇంకేం తెలియదు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయకండి.

నేను ఒక భార్యగా బాధ పడ్డాను. కానీ.. ఒక రాజకీయ నాయకుడిగా ఆయనకు నా మద్దతు ఎప్పటికీ ఉంటుంది.. అంటూ రేణు దేశాయ్ వీడియోలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రేణు దేశాయ్ వీడియోపై తాజాగా ఆర్కే రోజా స్పందించారు. ఆవిడే ఇటీవల ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్పారు. నన్ను ఎవరైతే తిడుతున్నారో.. పవన్ కళ్యాణ్ లేడీ ఫ్యాన్స్ మీ భర్తలు మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత వేరే వాళ్లకు కడుపు చేస్తే ఊరుకుంటారా? అంటూ రేణు దేశాయ్ అన్న వీడియోను నేను చూశాను.. అంటూ ఆర్కే రోజా చెప్పుకొచ్చారు.

ap minister rk roja comments on renu desai

ap minister rk roja comments on renu desai

Roja – Renu Desai : ఆరోజు ఇంటర్వ్యూలోనే క్లియర్ కట్ గా చెప్పింది కదా

ఆరోజు ఇంటర్వ్యూలోనే పబ్లిక్ గా పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేసింది రేణూ దేశాయ్. మరి.. ఈరోజు రాజకీయంగా పవన్ కు మద్దతు ఇస్తా అంటూ మళ్లీ ఆవిడే చెప్పింది. అలా ఆమె ఎందుకు చెప్పింది.. ఎవరు చెప్పించారు అనేది ఆవిడే చెప్పాలి.. అంటూ ఆర్కే రోజా ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ వీడియోపై స్పందించారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది