YS Jagan : విజయవాడలో సీఎం జగన్ బస్సు యాత్ర చేస్తుండగా రాళ్ల దాడి చేయడం ఎంత సంచలనం రేపుతుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ దాడిపై అటు ప్రతిపక్షాలు ఇటు అధికార వైసీపీ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. వైసీపీ వాళ్లే చేయించి డ్రామా ఆడుతున్నారని కూటమి నేతలు అంటుంటే.. ప్రతిపక్షాలే దాడి చేయించాయని జగన్ సహా వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతో ఏపీలో రాళ్ల దాడి నేపథ్యంలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అసలు దాడి ఎవరు చేయించారనేది ఇంకా తేలలేదు. దాంతో ఇప్పుడు పోలీసులపై ఒత్తిడి పెరిగిపోయింది.
బాధ్యులను పట్టుకుని చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. దాంతో పోలీసులు కూడా ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఏపీ నిగా వ్యవస్థ మీదనే ఈ దాడి అనుమానాలు పెంచుతోంది కాబట్టి డీజీపీ పర్యవేక్షణలో ఈ కేసును పోలీసులు ఛేదిస్తున్నారు. అయితే కేసులో పురోగతి లభించినట్టు తెలుస్తోంది. ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా కొంత మందిని విచారించారు. విచారించిన వ్యక్తుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు పోలీసులు. రాబట్టిన సమాచారాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే కొందరిని అదుపులోకి విచారణ చేసినప్పుడు విజయవాడలోని సింగనగర్ లోని వడ్డెర కాలనీకి చెందిన వ్యక్తే ఈ దాడి చేసినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పూర్తి సమాచారం తెలిసేంత వరకు ఈ విషయాలు బటయకు పొక్కకుండా చూసుకుంటున్నారు. ఇది సీఎం మీద దాడి కేసు కాబట్టి మధ్యలోనే కొన్ని వివరాలు బయటకు వస్తే పార్టీలు గగ్గోలు పెడుతాయనే ఉద్దేశంతో పూర్తిగా సమాచారం తెలిసేంత వరకు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఇందులో భాగంగా పోలీసులు ఈ రోజు సాయంత్రం లేదా రేపటిలోగా కేసును ఛేదిస్తామని తెలుపుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా బయటకు వెళ్లకుడా డీజీపీ ఆదేశాలు ఇచ్చారంట. దాంతో పోలీసులు అసలు ఏం చెబుతారా.. రాయి విసిరిన వ్యక్తి ఎందుకు దాడి చేశాడనేది బయటకు తెలుస్తుందా లేదా అనేది అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Ram Charan Cutout : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో…
Allu Arjun : పుష్ప 2 షాక్ తో అల్లు అర్జున్ మరోసారి Daku Maharaj పబ్లిక్ లోకి రావడం…
Mahesh Babu SS Rajamouli : దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అలియాస్ జక్కన్న దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.…
Good News : మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి మరియు ఆర్థిక వ్యవస్థ మందగించడంతో వినియోగాన్ని పెంచడానికి ఫిబ్రవరి బడ్జెట్లో…
Venkatesh : నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న వెంకటేష్ తన పర్సనల్ ప్రొఫెషనల్ విషయాల గురించి చాలా…
2024 Rewind : మరి కొద్ది రోజులలో ఈ ఏడాదికి ముగింపు పడనుంది. 2024 ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలపై చెరగని…
Game Changer Movie Review : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం సంక్రాంతి కానుకగా…
Ration Card : భారతదేశంలోని రేషన్ కార్డ్ హోల్డర్లందరూ తమ e-KYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) ధృవీకరణను డిసెంబర్…
This website uses cookies.