
AP Politics : పొత్తు కుదిరింది.. కాని సీట్ల పంచాయతీ మళ్లీ మొదటికి వచ్చిందే..!
AP Politics : ఈ సారి ఏపీ ఎలక్షన్స్ చాలా రంజుగా మారబోతున్నాయి. ఏపీలో వైసీపీ ని గద్దె దించే లక్ష్యంతో టీడీపీ -బీజేపీ -జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. పదేళ్ల తర్వాత ఈ మూడు పార్టీలు కలిసి పని చేస్తుండడంతో పోటీ ఆసక్తికరంగా మారనుంది.అయితే పొత్తులో భాగంగా బీజేపీకి 6 పార్లమెంటు, పది అసెంబ్లీ స్థానాలను కేటాయించిన విషయం తెలిసిందే. ఇక జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు సీట్ కి పోటీ చేయనుంది. ఇంకా మిగిలినవి 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు సీట్లు కాగా వాటిలో టీడీపీ పోటీ పడనుంది. అయితే మూడు పార్టీల పార్లమెంటు అభ్యర్ధులు ఖరారు కాకపోవడంతో అందరిలో సందిగ్ధం నెలకొంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాము పోటీ చేసే రెండు పార్లమెంటు స్థానాల్లో ఒకటైన కాకినాడకు తంగెళ్ల ఉదయశ్రీనివాస్ ను అభ్యర్థిగా ప్రకటించిన కూడా టీడీపీ పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించకపోవడానికి కారణం బీజేపీ ప్రధాన కారణంగా తెలుస్తుంది.
టీడీపీ, జనసేన కోరినవి బీజేపీ కోరుతుండడంతో అసలు సమస్య వచ్చింది. ఉత్తరాంధ్రలో అనకాపల్లి, విజయనగరం ఎంపీ సీట్లను బీజేపీకి ఇవ్వాలని టీడీపీ భావించగా ఇక్కడ బీజేపీ కొత్త పాట పాడుతుంది. అనకాపల్లి ఎంపీ స్థానానికి బదులు విశాఖపట్నం ఎంపీ స్థానాన్ని, విజయనగరంకు బదులుగా అమలాపురం పార్లమెంటు సీటును బీజేపీ కోరుతుందని టాక్ నడుస్తుంది. అలానే అనపర్తి, పాడేరు, ఆదోని, గుంటూరు పశ్చిమ, శ్రీకాళహస్తి, కదిరి సీట్లను బీజేపీ కోరుతోందని చెబుతున్నారు. అయితే ఆ సీట్లు చంద్రబాబు తమ పార్టీ అభ్యర్ధులకి కేటాయించగా వాటిని బీజేపీ కోరుతుండడం హాట్ టాపిక్‌గా మారింది.
బీజేపీ పట్టుబడితే సీట్ల మార్పు తప్పక జరుగుతుందని అంటున్నారు. జనసేన విషయానికి వస్తే ఆ పార్టీకి 21 అసెంబ్లీ స్థానాలు కేటాయించగా, ఇందులో ఏడు స్థానాలకే అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే ఆ సీట్లలో కొన్నింటిని బీజేపీ కోరుతుందని టాక్ నడుస్తుంది. వాటి గురించి చర్చించేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, తదితర నేతలు ఢిల్లీ వెళ్లారు. అక్కడ బీజేపీ పెద్దలను కలిసి పోటీకి ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను సమర్పించారని అదిష్టానం నిర్ణయం తర్వాత మళ్లీ కొత్తగా అభ్యర్ధులని ప్రకటిస్తారని సమాచారం. దీనికి మరింత సమయం పట్టే అవకాశం కూడా ఉందని టాక్. బీజేపీ పోటీ చేసే స్థానాల పేర్లు ఈ గ్యాప్‌లో ఫిక్స్ చేస్తే ఆ వెంటనే జనసేన, టీడీపీ తాము పోటీ చేసే సీట్లలో అభ్యర్థులను ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
This website uses cookies.