AP Survey 2024 : ఏపీలో గెలుపెవరితో తేలిపోయింది .. బయటికి వచ్చిన సంచలన సర్వే..!
ప్రధానాంశాలు:
AP Survey 2024 : ఏపీలో గెలుపెవరితో తేలిపోయింది .. బయటికి వచ్చిన సంచలన సర్వే..!
AP Survey 2024 : ఏపీలో శాసనసభ ఎన్నికలకు హోరాహోరి ఫైట్ నెలకొంది. వైసీపీ ఒంటరి పోరుకు సిద్ధమైంది. అటు తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. ఇక వైసీపీ ఎలాగైనా అధికారంలోకి రావాలని పెద్ద ఎత్తున అభ్యర్థులను మారుస్తుంది. ఇక టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై దృష్టి సారించాయి. వీరితో బిజెపి కలుస్తుందా లేదా అన్నది కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. మరోపక్క వై.యస్.షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడం ద్వారా బలం పెంచుకోవాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో ఏపీ ప్రజల మూడ్ పై తాజాగా ఓ సర్వే బయటకు వచ్చింది. తమ నివేదికలను వెల్లడించింది.
స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే సర్వే సంస్థ ఏపీలో ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేసింది. టీడీపీ, జనసేన కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి..వైసీపీ ఎన్ని స్థానాల్లో గెలుచుకోనుందో అంచనా వేసింది. ఈ సంస్థ గతంలో తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ ఎన్నికల సమయంలో సర్వేలు చేసింది. ఏపీలో సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ఆదరణ ఉన్నా, ఓట్ల విషయంలో వచ్చేసరికి ఆ స్థాయిలో లేదని తెలియజేసింది. గతంలో మాదిరిగానే ఎన్నికలకు మూడు నెలల ముందే ప్రజా అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నట్లు వివరించింది. అయితే రాష్ట్రంలో మూడు రీజియన్లను విభజించి ఫలితాలను వెల్లడించింది.
సర్వే ప్రకారం ఎవరికీ ఎన్ని సీట్లు అంటే :-
* ఉత్తరాంధ్రలో 35 స్థానాలకు వైసీపీకి 12 – 16 స్థానాలు, టీడీపీ, జనసేన కూటమికి 18 – 22 వరకు స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.
* కోస్తా ఆంధ్రాలో మొత్తం 85 స్థానాలకు వైసీపీకి 19 – 24 , టీడీపీ జనసేన కూటమికి 58 – 65 స్థానాలు వస్తాయని తెలిపింది.
* రాయలసీమలో మొత్తం 55 స్థానాలకు వైసీపీకి 36 – 40 , టీడీపీ, జనసేన కూటమికి 14 – 18 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.
అయితే ఈసారి కోస్తాంధ్రలో స్పష్టమైన మెజారిటీ దిశగా టీడీపీ, జనసేన కూటమి అడుగులు వేయటం విశేషం. ఉత్తరాంధ్రలో మాత్రం గట్టి పోటీ నెలకొంది. రాయలసీమలో మాత్రం వైసీపీ గెలవబోతున్నట్లుగా సర్వే తెలిపింది. గత ఎన్నికల్లో వైసీపీ దాదాపుగా వైట్ వాష్ చేసింది. 50 స్థానాలకు గత ఎన్నికల్లో వైసీపీ 52 చోట్ల విజయం సాధించింది. టీడీపీ మూడు స్థానాలకు పరిమితం అయింది. అయితే గత ఎన్నికల కంటే అదనంగా 15 స్థానాల వరకు టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చి చెప్పింది.