Home » Andhra Pradesh » Astrologer Venu Swamy Prediction On Ys Jagan Mohan Reddy In Ap Elections
andhra pradesh

Venu Swamy : ఈసారి వై.యస్ జగన్ ఎన్ని సీట్ల మెజారిటీతో గెలుస్తారో ముందే చెప్పేసిన వేణు స్వామి…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: March 24, 2024, 2:00 pm
Advertisement

Venu Swamy : జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసిన వేణు స్వామి పేరు బాగా వినిపిస్తోంది . అయితే వేణు స్వామి మొదట సినీ సెలబ్రిటీల జాతకాలు గురించి సోషల్ మీడియాలో చెబుతూ బాగా ఫేమస్ అయ్యారు. అంతేకాక వేణు స్వామి సినీ సెలబ్రిటీల గురించి చెప్పిన జాతకాలు కొన్ని నిజం అవడంతో వేణు స్వామి పేరు ఒక్కసారిగా పాపులర్ అయింది. ఆ విధంగా క్రేజ్ సంపాదించుకున్న వేణు స్వామి ప్రస్తుతం రాజకీయ నాయకుల పై కూడా పలు రకాల వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వేణు స్వామి పలువురు రాజకీయ వ్యక్తుల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ…కల్వకుంట్ల కవిత కచ్చితంగా అరెస్టు అవుతుందని తెలియజేశారు.

Advertisement

ఇక ఈ ఇంటర్వ్యూలో వేణు స్వామి చెప్పినట్లుగానే ఇటీవల కల్వకుంట్ల కవిత లిక్కర్స్ స్కామ్ కేసులో అరెస్ట్ అవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా వేణు స్వామి వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. కల్వకుంట్ల కవిత అరెస్టు అవుతుందని మూడు నెలల ముందే వేణు స్వామి చెప్పడంతో ఇప్పుడు ఆ వీడియో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వేణు స్వామి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వేణు స్వామి ఆంధ్ర రాజకీయాలపై కూడా స్పందించడం జరిగింది.. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని తెలియజేశారు. అంతేకాదు 2029లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి విజయం సాధిస్తారని వేణు స్వామి స్పష్టం చేశారు.

ఇక తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కనిపించకుండా పోయే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇక వైయస్ షర్మిల గురించి మాట్లాడుకుంటే తన అన్న జగన్ మోహన్ రెడ్డి పక్కన ఉన్నట్లయితే కచ్చితంగా మంచి రాజకీయ ప్రస్తావం తనకి దక్కేదని కానీ ఇప్పుడు ఆమెకు అంతగా రాజకీయం కలిసి రాదని తెలియజేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి విజయం సాధిస్తారని అలాగే 2029లో జరగబోయే ఎన్నికల్లో కూడా జగన్ రోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. మరి రానున్న ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి