Avanthi Srinivas : టీడీపీలోకి అవంతి శ్రీనివాస్.. నిజమా..?
ప్రధానాంశాలు:
జగన్ కు అవంతి శ్రీనివాస్ షాక్ ఇవ్వబోతున్నాడా..?
టీడీపీ లోకి అవంతి శ్రీనివాస్..?
Avanthi Srinivas : టీడీపీలోకి అవంతి శ్రీనివాస్.. నిజమా..?
Avanthi Srinivas : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భీమిలి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా సేవలందించిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్, పార్టీ ఓటమి అనంతరం రాజకీయంగా పూర్తిగా మౌనవ్రతం పాటిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత నుంచి అవంతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఎక్కడా ప్రజల్లోనూ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో అనకాపల్లి ఎంపీగా టీడీపీ తరఫున గెలిచిన అనుభవం ఉన్న అవంతి ఇప్పుడు అదే పార్టీలోకి మళ్లీ వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వినికిడి.

Avanthi Srinivas : టీడీపీలోకి అవంతి శ్రీనివాస్.. నిజమా..?
Avanthi Srinivas : అవంతి శ్రీనివాస్..సైకిల్ ఎక్కబోతున్నారా..?
అవంతి శ్రీనివాస్ తన సన్నిహితులతో కూటమిలోకి వెళ్లే విషయమై చర్చలు జరిపినట్లు సమాచారం. ఇప్పటికే కూటమి పార్టీలపై ఎలాంటి విమర్శలు చేయకుండా మౌనం పాటించడం, వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉండటం వంటి విషయాలు ఆయన పార్టీ మారే సూచనలుగా రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. టీడీపీ కూడా ఆయన ఎంట్రీకు సానుకూలంగా స్పందిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అవంతికి టీడీపీ కండువా కప్పే అవకాశం ఉందని, విశాఖ జిల్లా పరిధిలో కొత్తగా ఏర్పడే నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ హామీ ఇచ్చినట్టు సమాచారం.
అయితే, అవంతి రాజకీయ గురువు అయిన గంటా శ్రీనివాస్ ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మంత్రి పదవి లభించకపోవడంపై ఆయనలో అసంతృప్తి ఉండగా, తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని పార్టీకి తీసుకొస్తే ఆయన స్పందన ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే అవంతికి భీమిలికి సమీపంగా ఉన్న నియోజకవర్గాల్లో టికెట్ హామీ ఇవ్వడంతో ఆయన తిరిగి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారనే సమాచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.