భార్య భారతి పేరు లేవేనత్తీ సీఎం జగన్ పై అయ్యన్నపాత్రుడు విమర్శలు వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

భార్య భారతి పేరు లేవేనత్తీ సీఎం జగన్ పై అయ్యన్నపాత్రుడు విమర్శలు వీడియో వైరల్..!!

టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక్క అవకాశం అని చెప్పి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారు అని ఆరోపించారు. ఇసుక ఇంక మైనింగ్ అన్ని చోట్ల దోచేసుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అధికారంలోకి వస్తే మద్యపాన్ని నిషేధిస్తానని చెప్పి ఇప్పుడు మాట మార్చారని సీఎం జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. నిన్ను అనవసరంగా ప్రజలు ఎన్నుకున్నారు కర్మ కాలి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యావు అంటూ […]

 Authored By sekhar | The Telugu News | Updated on :20 July 2023,10:00 am

టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక్క అవకాశం అని చెప్పి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారు అని ఆరోపించారు. ఇసుక ఇంక మైనింగ్ అన్ని చోట్ల దోచేసుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అధికారంలోకి వస్తే మద్యపాన్ని నిషేధిస్తానని చెప్పి ఇప్పుడు మాట మార్చారని సీఎం జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. నిన్ను అనవసరంగా ప్రజలు ఎన్నుకున్నారు కర్మ కాలి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యావు అంటూ మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ బ్రాందీ షాపులు అందులోనూ చెత్త దరిద్రపు బ్రాందీలు తీసుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందు తాగి సినిమా కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణించాడని ఆరోపించారు. ఇటువంటి నాసిరకం బ్రాందీలు రాష్ట్రంలోకి తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో ఈ ముఖ్యమంత్రి ఆడుకుంటున్నారు.. అధికారంలో ఉండటం అవసరమా అని నిలదీశారు. అన్ని చోట్ల డిజిటల్ కరెన్సీ పెట్టి బ్రాందీ షాపుల దగ్గర తీసేసి ఆ డబ్బులు దోచుకుంటున్నారని విమర్శించారు. ఒకటే రాజధాని అని చెప్పే అధికారంలోకి వచ్చి మూడు రాజధానులు చేసావు అని జగన్ ని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాజధాని అనేది రాష్ట్రం నడిబొడ్డులో ఉండాలి. విశాఖపట్నంలో పెడితే రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్ళు రావడానికి ఎంతో కష్టం ఏర్పడుతుంది.

ayyannapatra Comments on Ys jagan

ayyannapatra Comments on Ys jagan

30 లక్షల ఇల్లు పేదవారికి ఇస్తానని చెప్పి కేవలం పట్టాలు ఇచ్చి 870 ఇల్లు మాత్రమే నిర్మించినట్లు ఇది మోసం కాదా జగన్ అంటూ అయ్యన్నపాత్రుడు మండిపడటం జరిగింది. సిమెంట్ ధర పెంచటానికి కారణం వాళ్ళ ఆవిడ భారతి పేరిట సిమెంటు ఫ్యాక్టరీలు అని అన్నారు. ఇల్లు నిర్మించుకోవడానికి 1,50,000 కేంద్రం ఇస్తుంది అని… దానికి జగనన్న కాలనీలు అనే పేరు పెట్టడం పట్ల సీరియస్ అయ్యారు. ఇంకా అనేక విషయాలపై అయ్యన్నపాత్రుడు మండిపడటం జరిగింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది