Balakrishna : ఈ నడుమ నందమూరి కుటుంబంలో లుకలుకలు అప్పుడప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బాలయ్య ఫ్యాన్స్ కు మధ్య వార్ జరుగుతూనే ఉంది. అయితే అప్పుడప్పుడు బాలయ్య వ్యాఖ్యలతో అది ఎప్పటికప్పుడు బయట పడుతూనే వస్తోంది. కాగా బాలయ్య తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం రేపాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో బాలయ్య చాలా రోజులుగా పార్టీ తరఫున ప్రచారం చేశారు. పార్టీని గెలిపించడం కోసం చాలా నియోజకవర్గాల్లో తిరుగుతూ కష్టపడ్డారు. తాజాగా కాజల్ చిత్రం ట్రైలర్ ను రిలీజ్ చేశారు బాలయ్య.
కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్న మూవీ సత్యభామ. సుమన్ చిక్కాల దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై లేడీ అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. జూన్ 7న మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ ట్రైలర్ ఈవెంట్ ను నిర్వహించారు. బాలయ్య వచ్చి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను 40 రోజులుగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండి కెమెరాను మిస్ అయినట్టు తెలిపారు. అయితే ఎన్టీఆర్ వారసులు అని చెప్పుకోవడానికి ఆయన గురించి చెప్పుకుంటే సరిపోదన్నారు. ఆయన సినిమాల గురించి గొప్పగా చెప్పుకున్నంత మాత్రాన ఆయన వారసులు కారని చెప్పుకొచ్చారు బాలకృష్ణ.
సీనియర్ ఎన్టీఆర్ చూపిన మార్గంలో నడిచిన వారే ఆయన వారసులు అని చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలు పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించే చేశాడని అంటున్నారు. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ తరఫున జూనియర్ ప్రచారం చేయట్లేదు కాబట్టి ఆయన వారసుడు కాదు అని ఇన్ డైరెక్ట్ గా బాలయ్య చెప్పేశాడని అంటున్నారు. దీనిపై జూనియర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. బాలయ్యకు ఏం తెలుసని అలా కామెంట్ చేశాడని అడుగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కోసం ఎంతో కష్టపడితే ఇవాళ కావాలనే పక్కన పెట్టేసినట్టు గుర్తు చేస్తున్నారు. అటు బాలయ్య ఫ్యాన్స్ కూడా జూనియర్ అభిమానులకు గట్టి కౌంటర్ వేస్తున్నారు.
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
This website uses cookies.