Balakrishna : ఎన్టీఆర్ కు కౌంటర్ వేసిన బాలయ్య.. మరో రచ్చ షురూ..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Balakrishna : ఎన్టీఆర్ కు కౌంటర్ వేసిన బాలయ్య.. మరో రచ్చ షురూ..!

Balakrishna : ఈ నడుమ నందమూరి కుటుంబంలో లుకలుకలు అప్పుడప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బాలయ్య ఫ్యాన్స్ కు మధ్య వార్ జరుగుతూనే ఉంది. అయితే అప్పుడప్పుడు బాలయ్య వ్యాఖ్యలతో అది ఎప్పటికప్పుడు బయట పడుతూనే వస్తోంది. కాగా బాలయ్య తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం రేపాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో బాలయ్య చాలా రోజులుగా పార్టీ తరఫున ప్రచారం చేశారు. పార్టీని గెలిపించడం కోసం చాలా నియోజకవర్గాల్లో […]

 Authored By ramu | The Telugu News | Updated on :26 May 2024,6:00 pm

Balakrishna : ఈ నడుమ నందమూరి కుటుంబంలో లుకలుకలు అప్పుడప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బాలయ్య ఫ్యాన్స్ కు మధ్య వార్ జరుగుతూనే ఉంది. అయితే అప్పుడప్పుడు బాలయ్య వ్యాఖ్యలతో అది ఎప్పటికప్పుడు బయట పడుతూనే వస్తోంది. కాగా బాలయ్య తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం రేపాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో బాలయ్య చాలా రోజులుగా పార్టీ తరఫున ప్రచారం చేశారు. పార్టీని గెలిపించడం కోసం చాలా నియోజకవర్గాల్లో తిరుగుతూ కష్టపడ్డారు. తాజాగా కాజల్ చిత్రం ట్రైలర్ ను రిలీజ్ చేశారు బాలయ్య.

Balakrishna : 40 రోజులుగా ప్రచారం..

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్న మూవీ సత్యభామ. సుమన్ చిక్కాల దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై లేడీ అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. జూన్ 7న మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ ట్రైలర్ ఈవెంట్ ను నిర్వహించారు. బాలయ్య వచ్చి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను 40 రోజులుగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండి కెమెరాను మిస్ అయినట్టు తెలిపారు. అయితే ఎన్టీఆర్ వారసులు అని చెప్పుకోవడానికి ఆయన గురించి చెప్పుకుంటే సరిపోదన్నారు. ఆయన సినిమాల గురించి గొప్పగా చెప్పుకున్నంత మాత్రాన ఆయన వారసులు కారని చెప్పుకొచ్చారు బాలకృష్ణ.

సీనియర్ ఎన్టీఆర్ చూపిన మార్గంలో నడిచిన వారే ఆయన వారసులు అని చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలు పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించే చేశాడని అంటున్నారు. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ తరఫున జూనియర్ ప్రచారం చేయట్లేదు కాబట్టి ఆయన వారసుడు కాదు అని ఇన్ డైరెక్ట్ గా బాలయ్య చెప్పేశాడని అంటున్నారు. దీనిపై జూనియర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. బాలయ్యకు ఏం తెలుసని అలా కామెంట్ చేశాడని అడుగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కోసం ఎంతో కష్టపడితే ఇవాళ కావాలనే పక్కన పెట్టేసినట్టు గుర్తు చేస్తున్నారు. అటు బాలయ్య ఫ్యాన్స్ కూడా జూనియర్ అభిమానులకు గట్టి కౌంటర్ వేస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది