Roja VS Balakrishna : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒకటే చర్చ. చంద్రబాబు అరెస్ట్ గురించే అందరూ మాట్లాడుతున్నారు. వైసీపీ నేతలు అయితే చంద్రబాబు అరెస్ట్ కావడంతో పండుగ చేసుకుంటున్నారు. టీడీపీ నేతలు రోడ్లు మీదికి వచ్చి మరీ నిరసన తెలుపుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసింది ఈ ఒక్క తప్పే కాదు. ఇదొక్కటే కాదు.. 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు చేసిన కుంభకోణాలు చాలా ఉన్నాయి. అవన్నీ విచారణ జరిగి నేరం రుజువు అయితే చంద్రబాబు జీవితాంతం జైలులోనే ఉండాలి. బయటికి కూడా రాడు అంటూ రోజా కామెంట్ చేశారు.ఇది నేను ఎప్పుడో చెప్పాను. ఒక్కసారి చంద్రబాబు బోను ఎక్కి కేసు విచారణకు సిద్ధం అయితే ఇక ఆయన బయటికి రావడం కష్టం అని చెప్పాను. చంద్రబాబుకు జైలులో చాలా సెక్యూరిటీ ఇచ్చారు.
ఆయన ప్రాణాలకు కూడా ఎలాంటి ముప్పు లేదు. ఆయన ఎవరినైనా చంపుతారు అంటే భయపడాలి కానీ.. ఆయన్ను ఎవ్వరూ చంపరు. ఎన్టీఆర్ లాంటి గొప్ప నాయకుడిని అడ్డంగా మోసం చేశారు. ఎన్టీఆర్ నిజమైన అభిమానులు చాలా సంతోషంగా ఉన్నరోజు. రాజకీయంగా ఆయన ఎంతమందిని పైకి పంపించారు.. ఎంతమందిని జైలుకు పంపించారు. ఎంతమందిని క్యారెక్టర్ లేని వారిగా ముద్ర వేయించారో అందరికీ తెలుసు. చంద్రబాబు ఏం చేస్తాడో అది తమకు చేస్తారు అన్నట్టుగా పార్టీ వాళ్లు మాట్లాడుతారు. పాపి చిరాయువు. చంద్రబాబు చేసిన పాపాలకు ఆయన మొత్తం అనుభవించాలి. ఆయన చేసిన తప్పులు, పాపాలు అన్ని కూడా జైలులో కూర్చొని పచ్చాత్తాప పడే రోజులు ఇవి అంటూ రోజా చెప్పుకొచ్చారు.
2009 ఎన్నికల్లో చంద్రబాబు.. జూనియర్ ఎన్టీఆర్ ను ఎలా వాడుకున్నాడో అందరికీ తెలుసు. ఆయనకు యాక్సిడెంట్ అయి చావు బతుకుల నుంచి బయటికి వచ్చాడు. ఆయన్ను ఎలా వాడుకొని చంద్రబాబు తన కొడుకు లోకేష్ కోసం పార్టీ నుంచి గెంటేశాడో అందరికీ తెలుసు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించాలి అంటూ రోజా సీరియస్ అయ్యారు. అయితే.. రోజా వ్యాఖ్యలపై బాలకృష్ణ కూడా స్పందించారు. పిచ్చి కుక్కలు మొరుగుతుంటే మనం పట్టించుకోవాలా? మన విధానం, ఇచ్చిన హక్కు.. మన హక్కుల కోసం మనం పోరాడి తీరాలి. అంతే కానీ.. పిచ్చి కుక్కలు మొరుగుతుంటే వాటికి భయపడి చేతులు ముడుచుకొని కూర్చొంటే మన రాష్ట్రాన్ని నడిరోడ్డు మీద అమ్మేస్తారు అంటూ బాలకృష్ణ సీరియస్ అయ్యారు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.