Bhogapuram Airport : ఇలా చేస్తే భోగాపురం ఎయిర్ పోర్ట్ కి తక్కువ ఖర్చు తో హ్యాపీ గా వెళ్ళిపోతారు..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 31 July 2026, 6:00 am
  •  Bhogapuram Airport విశాఖపట్నం ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సమయం దగ్గరపడింది. అధికారికంగా శనివారం ప్రారంభమవుతున్న

Bhogapuram Airport : విశాఖపట్నం ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సమయం దగ్గరపడింది. అధికారికంగా శనివారం ప్రారంభమవుతున్న ఈ ఎయిర్‌పోర్టు, పూర్తి స్థాయి సేవలు మాత్రం ఆగస్టు 17 నుంచి (ఆగస్టు 16 అర్ధరాత్రి 12 గంటల నుంచి) అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త విమానాశ్రయానికి చేరుకోవడానికి పట్టే సమయం, దూరం, ఖర్చులపై ప్రయాణికుల్లో ఆసక్తి పెరుగుతోంది. విశాఖ నగరంలోని ప్రాంతాన్ని బట్టి భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకోవడానికి పట్టే సమయం మారుతూ ఉంటుంది. నగర కేంద్రంగా భావించే ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బయలుదేరితే సుమారు ఒక గంట సమయం పడుతుంది. అదే బీచ్ రోడ్, రుషికొండ ప్రాంతాల నుంచి భీమిలి మీదుగా వెళితే 45 నుంచి 50 నిమిషాల్లో చేరుకోవచ్చు. అయితే గాజువాక, స్టీల్ ప్లాంట్ ప్రాంతాల నుంచి వెళ్లేవారికి మాత్రం 1 గంట 15 నిమిషాల నుంచి ఒకటిన్నర గంట వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పాత ఎయిర్‌పోర్టుకు 10-15 నిమిషాల్లో చేరుకునే వారికి ఇది పెద్ద మార్పుగా మారనుంది.

Bhogapuram Airport : ఇలా చేస్తే భోగాపురం ఎయిర్ పోర్ట్ కి తక్కువ ఖర్చు తో హ్యాపీ గా వెళ్ళిపోతారు..!

Bhogapuram Airport : ఇలా చేస్తే భోగాపురం ఎయిర్ పోర్ట్ కి తక్కువ ఖర్చు తో హ్యాపీ గా వెళ్ళిపోతారు..!

Bhogapuram Airport దూరం, ప్రయాణ సమయం – ప్రాంతాలవారీగా వ్యత్యాసం

విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు కనిష్ఠ దూరం సుమారు 36 కి.మీ కాగా, గరిష్ఠంగా 60 నుంచి 65 కి.మీ వరకు ఉంటుంది. నగర ఉత్తర భాగమైన రుషికొండ, మధురవాడ ఐటీ హిల్స్ ప్రాంతాల నుంచి కేవలం 36 కి.మీ దూరమే ఉంటుంది. అదే ద్వారకానగర్, ఆర్టీసీ కాంప్లెక్స్ వంటి సిటీ సెంట్రల్ ప్రాంతాల నుంచి జాతీయ రహదారి 16 మార్గంలో దూరం 43.5 కి.మీ. పాత విమానాశ్రయం నుంచి కొత్తదానికి సుమారు 55 కి.మీ ఉంటుంది.నగర దక్షిణ భాగమైన గాజువాక, కూర్మన్నపాలెం, స్టీల్ ప్లాంట్ ప్రాంతాల వారికి దూరం మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు 59 నుంచి 65 కి.మీ వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. దూరం పెరగడంతో పాటు ట్రాఫిక్ పరిస్థితులు కూడా ప్రయాణ సమయంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Bhogapuram Airport ఖర్చులు, రవాణా ఏర్పాట్లు – ప్రభుత్వం చర్యలు

ప్రస్తుతం క్యాబ్ ద్వారా భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలంటే కనిష్ఠంగా రూ.1100 నుంచి గరిష్ఠంగా రూ.2000 వరకు ఖర్చు అవుతుంది. మధురవాడ, రుషికొండ, భీమిలి ప్రాంతాల నుంచి అయితే రూ.1000 నుంచి రూ.1200 మధ్యలోనే ఖర్చు ఉంటుంది. ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ, సిరిపురం ప్రాంతాల నుంచి ప్రయాణిస్తే రూ.1200 నుంచి రూ.1500 వరకు ఖర్చు కావచ్చు. గాజువాక, స్టీల్ ప్లాంట్ ప్రాంతాల నుంచి అయితే రూ.1600 నుంచి రూ.2000 వరకు చెల్లించాల్సి ఉంటుంది.ఈ భారం తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. విశాఖ నగర వ్యాప్తంగా 9 ఏసీ లాంజ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా భోగాపురం ఎయిర్‌పోర్టు కోసం ప్రత్యేకంగా 20 ఎలక్ట్రిక్ బస్సులను నడపనుంది. “ఏరో బస్సులు” పేరుతో ప్రతి అరగంటకు ఒక బస్సు బయలుదేరేలా ప్రణాళిక రూపొందించారు. ఈ బస్సుల్లో టికెట్ ధరను రూ.150గా నిర్ణయించేలా చర్యలు తీసుకుంటున్నారు.

అయితే ఎక్కువ సామాను ఉన్న ప్రయాణికులు క్యాబ్ సేవలను ప్రాధాన్యం ఇవ్వవచ్చని భావిస్తున్నారు. మరోవైపు నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు జాతీయ రహదారి మీద ఒత్తిడి తగ్గించేలా 15 ప్రత్యామ్నాయ రహదారులను విస్తరించే పనులు చేపట్టారు. ఇందులో తొలి దశలో 7 మార్గాలను అభివృద్ధి చేశారు. మిగతా మార్గాలు అందుబాటులోకి రావడానికి కొంత సమయం పట్టనుంది.మొత్తంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం విశాఖ అభివృద్ధిలో కీలక అడుగుగా భావించబడుతోంది. అయితే ప్రారంభ దశలో ప్రయాణ సమయం, ఖర్చులు, ట్రాఫిక్ సమస్యల కారణంగా కొంత ఇబ్బంది తప్పదని అంచనా. ప్రభుత్వ ప్రణాళికలు పూర్తిగా అమలులోకి వచ్చిన తర్వాత పరిస్థితి మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. Bhogapuram Airport, Vizag Airport, Andhra Pradesh News, Airport Travel, Visakhapatnam,

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి