Categories: andhra pradeshNews

Perni Nani : పేర్ని నాని బిగ్ రిలీఫ్.. రేషన్ బియ్యం కేసులో హైకోర్టు ముంద‌స్తు బెయిల్‌..!

Perni Nani : ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య (నాని)కి ఊరట లభించింది. రేషన్ బియ్యం అక్రమ మార్పిడి కేసులో ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు పరిశీలించి, బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆయన ఏ6గా ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారం రేపగా, కోర్టు ఇచ్చిన తీర్పుతో నానికి కొంతవరకు ఊరట కలిగింది.

Perni Nani : పేర్ని నాని బిగ్ రిలీఫ్.. రేషన్ బియ్యం కేసులో హైకోర్టు ముంద‌స్తు బెయిల్‌..!

రేషన్ బియ్యం అక్రమంగా ప్రైవేట్ మిల్లర్లకు మళ్లించారనే ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. ఈ కేసులో పేర్ని నానితో పాటు మరికొంత మందిపై అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వానికి చెందిన రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేసి, మార్కెట్‌లో అక్రమంగా అమ్ముతున్నారన్న ఆరోపణలపై తీవ్ర దృష్టి పెట్టిన అధికార యంత్రాంగం, అనేక మంది అధికారులను విచారించింది. అయితే, తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా తనను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని నాని పేర్కొన్నారు.

ఇక మరోవైపు కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో వైవీ విక్రాంత్ రెడ్డికి కూడా హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు కూడా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోర్ట్ నిర్వహణలో అక్రమాలు జరిగాయని, ఇందులో పలువురు అధికారుల ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. విచారణలో భాగంగా విక్రాంత్ రెడ్డిపై కొన్ని కీలక ఆధారాలు ఉన్నాయని అధికార యంత్రాంగం చెబుతున్నప్పటికీ, కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం గమనార్హం. ఈ రెండు కేసులు రాష్ట్ర రాజకీయాల్లో మరింత సంచలనంగా మారాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ ఆరోపణల వెనుక ఉన్న అసలు నిజం ఏమిటి? దర్యాప్తు ఏ దిశగా కొనసాగుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది.

Recent Posts

Blue Berries | బ్లూబెర్రీస్ .. ఆరోగ్యానికి సంజీవని ..చిన్న పండులో అపారమైన మేలు

Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్‌ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…

4 days ago

Remedies | మీన రాశి వారికి ఏలినాటి శని రెండో దశ ప్రారంభం..జాగ్రత్తగా ఉండాలని పండితుల హెచ్చరిక

Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…

4 days ago

Rukmini Vasanth | రుక్మిణి వసంత్ పేరిట మోసాలు .. సోషల్ మీడియాలో బహిరంగ హెచ్చరిక!

Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్  తన పేరుతో జరుగుతున్న మోసాలపై…

4 days ago

Moringa Powder | మహిళల ఆరోగ్యానికి అద్భుత ఔషధం మునగ ఆకు పొడి.. లాభాలు ఎన్నో

Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…

5 days ago

Sesame Seeds | మహిళలకు ఆరోగ్య వరం …చిట్టి గింజలతో లాభాలు ఎన్నో

Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…

5 days ago

Heart Attacks | భారతదేశంలో పెరుగుతున్న గుండెపోటులు.. నిపుణుల హెచ్చరిక!

Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…

5 days ago

Triphala Powder | త్రిఫల చూర్ణం పాలతో తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు.. శీతాకాలంలో ఎందుకు ప్రత్యేకం తెలుసా?

Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…

5 days ago

Mole | జ్యోతిషశాస్త్రం ప్రకారం కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉన్నవారి వ్యక్తిత్వ రహస్యాలు!

Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…

5 days ago