
Uppal Nalla Cheruvu : ఉప్పల్ నల్లచెరువును కబ్జాల నుంచి కాపాడండి.. హైడ్రా కమిషనర్‌ను కోరిన ఉప్పల్ కార్పొరేటర్..!
Uppal Nalla Cheruvu : ఉప్పల్ Uppal నల్లచెరువు 2007కు పూర్వం నిండు కుండ వలె ఉండేదని ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్‌రెడ్డి rajitha Parameshwar Reddy Mandumula తెలిపారు. నేడు చెరువు మూడు వైపులా కబ్జాలకు గురయిందన్నారు. కబ్జాదారులపై చర్యలు తీసుకొని చెరువు పరిరక్షణకు కంచెను నిర్మించాలని కోరారు. చెరువు పరిరక్షణకు పూర్తిస్థాయిలో సర్వే చేయాలని సూచించారు. ఉప్పల్ నల్లచెరువు పరిరక్షణపై కార్పొరేటర్ రజితాపరమేశ్వర్‌రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కలిసి పలు విషయాలను వివరించారు. నల్లచెరువు వరంగల్ జాతీయ రహదారి పక్కన సుమారు 120 ఎకరాల విస్తీర్ణంతో కళకళలాడుతూ ఉండేదన్నారు. ఉప్పల్, మేడిపల్లి రెవెన్యూ(గతంలో ఘట్‌కేసర్) మండలాల పరిధిలో ఉందన్నారు. ఇది ఉప్పల్, బోడుప్పల్ ప్రాంతాలకు మధ్యలో ఉందని తెలిపారు. నల్ల చెరువు ఎప్పుడు నిండుగా ఉండటంతోనే ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ ప్రాంతాలలో భూగర్భ జలాలు అడుగంటకుండా కాపాడుతుందన్నారు.
Uppal Nalla Cheruvu : ఉప్పల్ నల్లచెరువును కబ్జాల నుంచి కాపాడండి.. హైడ్రా కమిషనర్‌ను కోరిన ఉప్పల్ కార్పొరేటర్..!
2007 ముందు పద్దతి ప్రకారం చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లను రెవెన్యూ, ఇరిగేషన్, లేక్స్ విభాగం, హెచ్ఎండీఏ విభాగాల అధికారులు సంయుక్తంగా గుర్తించేవారని గుర్తు చేశారు. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లకు సంబంధించిన హద్దు రాళ్లను కూడా పెట్టేవారన్నారు. 2008 నుంచి బోడుప్పల్ వైపుకు నల్లచెరువులో కబ్జాలు మొదలయ్యాయి. అయినప్పటికీ నాడు ఘట్‌కేసర్ రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.-ఉప్పల్ రెవెన్యూ విభాగం అధికారులు ఘట్‌కేసర్ వారి మీద నెట్టేసి తమకేం పట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చారన్నారు. పొత్తుల చెరువు కావడంతో ఉప్పల్, ఘట్‌కేసర్ రెవెన్యూ విభాగాల అధికారుల సమన్వయ లోపం, నిర్లక్ష్యం కారణంగా కబ్జాలు మొదలయ్యాయని గుర్తు చేశారు. రెండు ఏళ్లల్లోనే బోడుప్పల్ వైపుకు ఏకంగా చెరువును పూడుస్తూ ఇళ్ల నిర్మాణాలు చేపట్టినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు.
2011లో మరో కొందరు బోడుప్పల్ వైపు చెరువులో రాత్రికి రాత్రే మట్టిపోసి పూడ్చేసి కబ్జాకు పాల్పడ్డారన్నారు. నాటి తహశీల్దార్ లచ్చిరెడ్డి ఈ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు బనాయించారని గుర్తు చేశారు. పూర్తి స్థాయిలో చెరువును సర్వే చేయించి కబ్జాలను గుర్తించారని తెలిపారు. దీనికి సంబంధించిన మ్యాప్‌లను సైతం సిద్ధం చేయించారన్నారు.2017-18లో గత ప్రభుత్వం చెరువు అభివృద్ధి, సుందరీకరణకు రూ.11 కోట్ల నిధులను కేటాయించిందన్నారు. చెరువులో అభివృద్ధి, సుందరీకరణ పనులను ఏమీ చేపట్టలేదన్నారు. చెరువు మధ్యలో నుంచి కట్ట(బండ్)ను ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని చెప్పారు. పనులు చేయకపోగా నిధుల వృధాతో పాటు చెరువు కబ్జాకు తెర లేపారని గుర్తు చేశారు. దీంతో చెరువు మూడు వైపులా సుమారు 35 ఎకరాలకు పైగా చెరువు భూమి కబ్జాకు గురవుతూనే ఉందన్నారు. కొందరు చెరువులో మట్టిపోసి అద్దెలకు ఇచ్చుకొని లక్షల రూపాయలు ఈ రూపంలో తీసుకుంటున్నారని తెలిపారు. బోడుప్పల్ వైపుకు మళ్లీ ఇళ్ల నిర్మాణాలను చేస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు.
నల్లచెరువు లోపల ఒకరు ఏకంగా మట్టిపోసి ఓ ప్రార్ధన మందిరాన్ని కూడా నిర్మించినప్పటికీ ఎలాంటి చర్యలు లేవన్నారు. మందిరం ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం చెరువుకు మూడు వైపులా కబ్జాదారులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని వివరించారు. చిన్న చిన్న ప్లాట్లను చేసి పేదలకు అమ్ముతు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. చెరువును ఇప్పుడు కాపాడకపోతే మిగిలే పరిస్థితి లేదన్నారు.ప్రస్తుతం రెవెన్యూ, ఇతర విభాగాల వద్ద తప్పుడు మ్యాప్‌లు ఉన్నాయన్నారు. 2010-11కు పూర్వం ఉన్న మ్యాప్‌లను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం చెరువులో ఉన్న కబ్జాలను తొలగించాలన్నారు. చెరువు పరిరక్షణకు చెరువు మధ్యలో ఉన్న బండ్(కట్ట) బయట హద్దులను గుర్తించి చెరువు చుట్టూ పరిరక్షణకు కంచెను ఏర్పాటు చేయాలని కోరారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.