Borugadda Anil : అందుకే అలా తిట్టానంటూ బోరుగడ్డ అనీల్ సంచలన ఆరోపణలు..!
Borugadda Anil : రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పుకునే బోరుగడ్డ అనిల్ పలు వివాదాలతో వార్తలలో నిలుస్తూ ఉంటారు. బుధవారం రాత్రి పట్టాభిపురం పోలీసులు అనిల్‌ను ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. 2021లో కర్లపూడి బాబుప్రకాష్‌ను రూ. 50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించిన కేసులో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు అనిల్‌పై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న నిందితుడిని బుధవారం నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. బోరుగడ్డ అనిల్ కొంతకాలంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.. ఆయన కోసం పోలీసులు గాలించినా దొరకలేదు. ఆయన హైదరాబాద్, బెంగళూరులో కొంతకాలం తలదాచుకున్నట్లు ప్రచారం జరిగింది.. ఇటీవలే ఆయన గుంటూరుకు వచ్చారు…
చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లతో పాటు .. రఘురామకృష్ణరాజు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలను బెదిరించారు అనీల్. అప్పటి ప్రతిపక్ష నేతలు, వారి కుటంబసభ్యులు టార్గెట్‌గా అసభ్యకరమైన వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. జగన్ ఒక్కసారి కనుసైగ చేస్తే చంద్రబాబును లేపేస్తానంటూ చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అయ్యింది. టీడీపీ నేతలు ఫిర్యాదులు చేసినా కేసులు నమోదు కాలేదు. అనుచిత వ్యాఖ్యలు ఎక్కువగా చేసే అనీల్‌పై తాజాగా కేసు నమోదైంది. ర్టు ఎదుట హాజరుపర్చగా.. అతడికి రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.కోర్టుకు హాజరుపర్చటానికి ముందు దాదాపు రెండు గంటల పాటు గుంటూరు అరండల్ పేటల డీఎస్పీ జయరాం ప్రసాద్ తో పాటు.. మరికొందరు పోలీసుల సమక్షంలో అనిల్ ను విచారించినట్లు చెబుతున్నారు.
Borugadda Anil : అందుకే అలా తిట్టానంటూ బోరుగడ్డ అనీల్ సంచలన ఆరోపణలు..!
కొన్ని ప్రశ్నలకి అనీల్ సమాధానం ఇస్తూ.. కొందరు వైసీపీ నేతల ఒత్తిడి.. ప్రోద్బలంతోనే తాను అప్పట్లో అలా వ్యవహరించినట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే.. వారి పేర్లను వెల్లడించలేదని తెలుస్తోంది. కొందరు వైసీపీ నేతల మాటల్నినమ్మి తాను దూకుడుగా వ్యవహరించినట్లుగా పేర్కొన్నట్లు సమాచారం. ఇకపై అలాంటి తప్పు చేయనని వాపోయినట్లుగా తెలుస్తోంది. నీ వెనుక ఉన్న వైసీపీ నేత ఎవరు? అని పదే పదే ప్రశ్నించినా సమాధానం చెప్పలేదని సమాచారం. గుంటూరు జిల్లాలోన వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు 20 కేసులు నమోదై ఉండగా.. రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని కేసులు ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.