
Diwali : దీపావళి రోజు ఏ నూనెతో దీపాలు వెలిగిస్తే మంచిది... శాస్త్రం ఏం చెబుతుందంటే....!
Diwali : హిందూ మతంలో దీపావళి పండుగను ఆశ్వీయుజ అమావాస్య రోజున రాత్రి చిమ్మ చీకట్లలో వెలుగులు నింపుతూ దీపాలను వెలిగిస్తారు. అయితే ఈ పండుగ లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. నువ్వుల నూనె వేసి వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని నమ్ముతారు. ప్రస్తుతం కొంతమంది దీపాలకు బదులుగా కొవ్వొత్తులను ,విద్యుత్ దీపాలను వెలిగిస్తున్నారు. అయితే ఇలా ఇంటి ముందు వెలిగిస్తే సరిపోతుంది. కానీ ఇంటి గుమ్మం మరియు తులసి చెట్టు దగ్గర మాత్రం మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి వెలిగించిన దీపాలను పెట్టాలి. అయితే దీపావళి పండుగ రోజున ప్రదోష సమయంలో లక్ష్మీదేవిని పూజించుకోవాలి. ఇక ఈరోజున ధనలక్ష్మికి పూజ చేస్తే ధన ధాన్యాలు సంపద కలుగుతాయని పురోహితులు చెబుతున్నారు. దీపం జ్ఞానానికి సంపద ఐశ్వర్యం ఆనందానికి ప్రతీకగా భావిస్తారు. కాబట్టి దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి దీపాలను పెట్టుకుంటే అమ్మ అనుగ్రహం తప్పనిసరిగా లభిస్తుంది. శాస్త్రం ప్రకారం దీపావళిలో దీపా అంటే దీపం అని… ఇక అవలి అంటే వరస అని అర్థం. కాబట్టి దీపావళి అంటే ఇంటి ముందు నువ్వుల నూనెతో దీపాలను వరుసగా వెలుగుతాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని నమ్మకం. అలాగే దీపావళి పండుగరోజు సాయంత్రం లక్ష్మి దేవిని పూజించుకొని తులసి కోట దగ్గర స్త్రీలు దీపాలను వెలిగించుకోవాలి. మీరు పెట్టే దీపంలో సకల దేవతలు వేదాలు ఉంటారని నమ్ముతూ శాంతి క్రాంతికి గుర్తుగా దీపాలను వెలిగించాలి…
దీపావళి రోజున వెలిగించే దీపాలను ఆవునేతితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం మంచిది. అయితే మొదటి దీపంలో వేప నూనె రెండు చుక్కలు, ఆవునెయ్యి కలిపిన దీపాన్ని పరమ శివుని ముందు వెలిగించడం ద్వారా విజయం ప్రాప్తిస్తుంది. దీపాలను నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. ఒక దీపాన్ని అగరబత్తితో వెలిగించి ఆ దీపంతో మరొక దీపానికి వెలిగించుకుంటూ దీపారాధన చేయాలి. ఆవు నెయ్యిలో సూర్యశక్తి నిండి ఉండడం వలన ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. అయితే శాస్త్రం ప్రకారం దీపారాధన కుందిలో 5 వత్తులు వేసి ఆ ఇంటి ఇల్లాలు స్వయంగా వెలిగించాలి.
Diwali : దీపావళి రోజు ఏ నూనెతో దీపాలు వెలిగిస్తే మంచిది… శాస్త్రం ఏం చెబుతుందంటే….!
మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసమని, రెండో వత్తి అత్త మామల క్షేమానికి, మూడోది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ క్షేమానికి, నాల్గవది గౌరవం, ధర్మవృద్ధిలకూ, అయిదోది వంశాభివృద్ధి కోసం వెలిగించాలి. ఇక అర్ధనారీశ్వరునికి దీపారాధన చెయ్యాలి అనుకునేవారు కొబ్బరి నూనె ఉపయోగించడం మంచిది. దీని వల్ల అనోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. అదేవిధంగా విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరినూనెను ఉపయోగించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అయితే చాలామంది దీపాలలో నువ్వుల నూనెలకు బదులుగా వేరుశనగ నూనెను ఉపయోగిస్తారు. కానీ ఇలా చేయకూడదు ఎందుకంటే నూవ్వుల నూనె సకల దేవతలకు ఇష్టం. కాబట్టి నువ్వుల నూనెతో వెలిగించే దీపాలు దుష్పలితాలను దూరం చేసి సకలశుభాలను ఇస్తుంది. కనుక దీపారాధనలో పొరపాటున కూడా వేరుశనగ నూనెను ఉపయోగించకూడదు.
Roja : చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే…
Cijayasai Reddy Padayatra : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సన్నిహితంగా మెలిగిన జగన్ - విజయసాయి రెడ్డి ద్వయం మధ్య…
Samantha : సమంత వ్యక్తిగతంగానే కాదు సినిమాల పరంగా కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంటుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత…
Chiranjeevi : ‘ మన శంకరవరప్రసాద్ గారు ’ మూవీ సక్సెస్ మీట్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…
Today Gold Rate on Jan 29th 2026 : బంగారం ధరల పెరుగుదల ప్రస్తుతం సామాన్యులకు పెను భారంగా…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 27వ ఎపిసోడ్లో ట్విస్టుల మీద ట్విస్టులు…
Black Hair : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న వర్క్ టెన్షన్స్ కారణంగా ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే…
Vegetables And Fruits : మన రోజువారీ ఆహారంలో కూరగాయలు, పండ్లు చాలా ముఖ్యమైనవి. అయితే మనకీ దొరికే ప్రతి…
This website uses cookies.