Botsa Satyanarayana : ఎస్సీ వర్గీకరణ విషయంలో కూటమి ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు: బొత్స
ప్రధానాంశాలు:
Botsa Satyanarayana : ఎస్సీ వర్గీకరణ విషయంలో కూటమి ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు: బొత్స
Botsa Satyanarayana : సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ఎస్సీ వర్గీకరణ కల ఆంధ్రప్రదేశ్‌లో సాకారమైంది. ఎస్సీ కులాల వర్గీకరణకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోద ముద్ర తెలిపింది. ఏకగ్రీవ ఆమోదం తెలిపిన అనంతరం సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా వర్గీకరణ ఉద్యమాన్ని గుర్తుచేసుకున్నారు.

Botsa Satyanarayana : ఎస్సీ వర్గీకరణ విషయంలో కూటమి ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు: బొత్స
Botsa Satyanarayana బొత్స ఫైర్..
మాదిగ కులాల పరిస్థితి.. వారి అభ్యున్నతిపై చంద్రబాబు మాట్లాడారు. వర్గీకరణ ఏపట్టినా ఇంకా అసమానతలపై పోరాటం చేయాలని సూచించారు. మాదిగలకు జరిగిన అన్యాయంపై మందకృష్ణ పోరాడారని ప్రశంసించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే సమస్య పరిష్కారం అవుతుందని గతంలోనే చెప్పానని వివరించారు. జిల్లాల వారీగా కేటగిరీల విభజన చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
జనగణన తర్వాత మరోసారి జిల్లాల వారీగా కేటగిరీల విభజన చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.అయితే దీనిపై బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి చిత్త శుద్ది లేదు. వర్గీకరణ కొసం పోరాడిన వారిపై టీడీపీ గతంలో కేసులు పెట్టింది. ఆ కేసులని ఎత్తేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డిది.అసలు వర్గీకరణ ఎలా చేశారు అన్న దానిపై చర్చే లేదు. అట్టడుగు వర్గాలపై కూటమి ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు అని బొత్స అన్నారు.